పైకి కనిపించకపోయినా, బిజెపి కూడా ఏపీలో మెల్లి మెల్లిగా బలపడేందుకు తమ రాజకీయ ఎత్తుగడలకు పదునుపెడుతోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎప్పటి నుంచో బలపడలేకపోతోంది.ఏపీలో ఏదో ఒక రకంగా బలపడాలని, 2024 నాటికి సొంతంగా బిజెపి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేసుకుంటోంది. జనసేన పార్టీ అండదండలు ఉంటాయని, పవన్ బీజేపీతో ఉన్నంతకాలం, కాపు సామాజికవర్గం అండదండలు కూడా బిజెపికి ఉంటాయని. ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఏపీ ప్రతిపక్ష పార్టీ టిడిపి కి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ, వెన్నుదన్నుగా నిలబడుతున్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆ పార్టీకి దూరం చేయడం ద్వారా, తాము ఆ స్థానాన్ని ఆక్రమించు అని, బీజేపీ ఆశలు పెట్టుకుంది.

 

IHG

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కనీసం 20 , 30 స్థానాలు  సంపాదిస్తుంది అని అందరూ అంచనా వేసినా, కాపు సామాజిక వర్గం ఎక్కువగా జగన్ కు అండగా నిలబడింది. దీంతో ఇప్పుడు కాపు రిజర్వేషన్ అంశాన్ని పవన్ ద్వారా బిజెపి కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఆ సామాజిక వర్గం లో కదలిక తీసుకు వచ్చి, వైసీపీకి ఆ సామాజిక వర్గం ఓట్లు దూరం చేయాలనే ఎత్తుగడ వేస్తోంది. అలాగే కమ్మ సామాజికవర్గం అండదండలు తెలుగుదేశం పార్టీకి దూరం చేసి, ఆ సామాజిక వర్గం ఓట్లు బిజెపి ఖాతాలో పడే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

 

గతంతో పోలిస్తే, బిజెపికి ఇప్పుడు ఆదరణ పెరిగిందని, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు, బీజేపీలో ఉండడంతో ఒక్కొక్కరుగా ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారని, ఏపీలో  కమ్మ సామాజిక వర్గ బీజేపీ నాయకులకు సముచిత స్థానం ఇవ్వడంతో పాటు, కేంద్రంలో ఏదైనా ఒక కీలక పదవి అప్పగిస్తే మరింతగా అక్కడ బిజెపి బలపడుతుందనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు, బలమైన నాయకులను తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేర్చుకోవాలని బీజేపీ అగ్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అదే జరిగితే టిడిపి మరింత బలహీనపడే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: