అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని రాజధాని ప్రాంత రైతులు గత కొంత కాలం నుండి ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలకు నిరసనలకు జనసేన - బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ నేతలు ముందునుండి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఎప్పుడైతే వైయస్ జగన్ మూడు రాజధానులు అని తెరపైకి కొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చారో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో తన కలల రాజధాని అమరావతి కోసం చంద్రబాబు రాజధాని రైతులతో పాటు దీక్షలో పాల్గొంటూ జోళ్లు పట్టుకొని నిరసన తెలపడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో ఇటీవల 200 రోజులకు రాజధాని ప్రాంత రైతులు చేసిన దీక్షలు చేరటంతో… చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇదే తరుణంలో ఆనాడు అమరావతిని రాజధాని గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వంలో అధికారం లో ఉన్న బీజేపీ మద్దతు తెలపడం జరిగిందని, అమరావతినే రాజధానిగా మాత్రమే గుర్తించాలంటే బీజేపీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇటీవల ప్రసంగించడం జరిగింది. ఇక్కడ వరకు కథ అంతా బాగానే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ ఇటీవల ఆయన అమరావతి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చినట్లు అయింది.

 

ఆయన ఏమన్నారంటే ఏపీ రాజధాని విషయంలో బీజేపీ వైఖరి అసలు మారదు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బీజేపీ చేసిన డిమాండ్ కి ఇంకా కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బీజేపీ - జనసేన పార్టీ శ్రేణులు అమరావతి రైతులకు అండగా ఉంటాం అంటూ భరోసా ఇచ్చారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు సునీల్ దేవధర్ తెలపటంతో... టీడీపీ శ్రేణుల నోట నుండి మాటలు రావడం లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: