ఏపీ రాజధాని అమరావతి కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వైసీపీ మూడు రాజధానులు అంటూ అమరావతిని పెద్దగా పట్టించుకోకుండా, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అమరావతి ని వ్యతిరేకిస్తున్న మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అమరావతికి సంఘీభావం ప్రకటించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారంలో  వెనకుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తోంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికే అమరావతి ప్రాంత వాసులు చేపట్టిన సమ్మె 200 రోజులు దాటిపోయింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతికి అనుకూలంగా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉన్నారు.

 

IHG

 

ఇక జనసేన పార్టీ కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపింది. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోషల్ మీడియా ద్వారా, తాను అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సైతం రాజధాని రైతులకు అండగా ఉంటానంటూ, తమ స్పందనను తెలియజేశారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, రాజధానిగా అమరావతి ఉంటుందని, దీన్ని ఒక్క ఇంచు కూడా కడపలేరు అని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆయన మాట్లాడారు. తర్వాత ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అమరావతికి బిజెపి మద్దతిస్తుందని, ఆ విషయంలో కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోదు అంటూ తేల్చేశారు.

 

అలాగే ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ కూడా అమరావతి కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినా ఆయన కూడా కేంద్రం జోక్యం చేసుకోదు అంటూ, మాట్లాడారు. సుజనా చౌదరి మాత్రమే కేంద్రం త్వరలో స్పందిస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని మాట్లాడగా, మిగతా కేంద్ర బిజెపి నాయకులు మాత్రం ఇది పూర్తిగా రాష్ట్ర వ్యవహారమని, ఇందులో తాము జోక్యం చేసుకోమని అన్నట్టుగానే తమ స్పందనను తెలియజేయడంతో, అసలు బిజెపి అమరావతి విషయంలో ఏ క్లారిటీ తో ఉందనేది స్పష్టం కావడం లేదు. బిజెపి నాయకులు రకరకాలుగా, ఇష్టమొచ్చినట్లుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడంతో అమరావతి ఉద్యమకారులు అయోమయంలో పడిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: