తాను నిప్పు లాంటి వాడిని.. నిప్పులా బతికాను అని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేదని, హుందాగా రాజకీయాలు చేశానని, ఇలా ఎన్నో చెప్పుకుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం ఏడు పదుల వయసు ఆయనకు నడుస్తోంది. మరి కొద్ది రోజుల్లో అయినా ఆయన రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోక తప్పని పరిస్థితి. ఈ సమయంలో నీతి నిజాయితీగా, హుందాగా వ్యవహరించి తన పెద్దరికాన్ని రాజకీయ అనుభవం తో సంపాదించుకున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉన్నా, ఆవిధంగా చేయకుండా, తప్పు చేసిన వారిని వెనకేసుకు వస్తూ, పైగా ఎదురు దాడి చేస్తూ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం టిడిపి లో కీలక నాయకులుగా ఉన్న కొంతమందిని పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు.

IHG

ఇదంతా కుట్రపూరితంగా, అధికార పార్టీ వైసీపీ వేధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా జరుగుతోందని, వైసీపీపై చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఇద్దరు అరెస్టయినా, ఈ వ్యవహారంలో వారి తప్పులు సాక్షాలతో సహా కనిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారు. ఆయనకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఏసీబీ అధికారులు సంపాదించారు. అలాగే కొల్లు రవీంద్రహత్య కేసులో పరోక్షంగా సంబంధాలు ఉండడం, నిందితులతో ఫోన్ లో మాట్లాడడం, అన్నిటిలోనూ, పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆయన బీసీ నాయకుడు కాబట్టి అరెస్టు చేశారంటూ చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

 

IHG

వైసిపి విధానాలను ప్రశ్నిస్తున్న కారణంగానే వీరిని అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపణలు చేస్తున్నా, ఇంతకంటే గట్టి వాయిస్ వినిపిస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్న ఎంతో మంది నాయకులు బయట తిరుగుతున్నారు. ముఖ్యంగా చెప్పుకుంటే నిత్యం సోషల్ మీడియా ద్వారా, ప్రభుత్వం పై విమర్శలు చేసే నారా లోకేష్ ను ప్రభుత్వం అరెస్టు చేసి, తమ రాజకీయ కక్ష తీర్చుకోవచ్చు కానీ, ఆ విధంగా వైసీపీ ప్రభుత్వం వెళ్లడం లేదు. కేవలం సాక్ష్యాలతో సహా, నేరం చేసినట్లు ఆధారాలు లభిస్తేనే అరెస్టుల జోలికి వెళ్తున్నట్టుగానే వ్యవహరిస్తోంది. అచ్చెన్న నాయుడు అరెస్టు చేసిన రోజునే మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా కీలక నాయకుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అరెస్టు చేసారు. నకిలీ పత్రాలతో అక్రమంగా వాహనాలను విక్రయించారు అనే కారణంతో అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ అరెస్టు అయినా, ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ, ప్రభుత్వం వేధిస్తోందని హడావుడి చేస్తూ, చంద్రబాబు ఆ పార్టీ నాయకులు ప్రజల్లో మరింతగా చులకన అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: