కొందరు అంతే.. కావాలని ప్రమాదాన్ని తెచ్చుకుంటారు. మనుషులన్నాక ఆ మాత్రం వెర్రి ఉంటుంది లెండి అని అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. అసలు పార్టీ ఏదో చక్కగా చేసుకోకుండా ఈ వెర్రి వేషాలు అవసరమా అని తిట్టాలనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. అంతగా ఎం జరిగింది? ఎవరికి ఏమైంది అని అనుకుంటున్నారా? 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జర్మనీకి చెందిన ఓ వ్యక్తి అతను ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో వెర్రి వేషాలు వేశాడు. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అతడి నాలుకపైనా పాము కాటు వేసింది. దీంతో ఆ వేడుక విషాదంగా ముగిసింది. జర్మనీలోని ఆస్ట్రియన్ ఆల్ఫ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

IHG- The New ...

 

ఓ ఆల్ఫైన్ హోటల్ లో 38 ఏళ్ల ఓ యువకుడు నేలపై ఉన్న రక్తపింజరి రకానికి చెందిన ఓ పాము పిల్లను పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు సైలెంట్ గా ఉండకుండా ఆ పామును ముద్దు పెట్టుకునేందు ప్రయత్నించాడు. ఇంకేమైంది ఆ పాము కాస్త అతన్ని దారుణంగా నాలుకపై కాటు వేసింది. 

 

IHG

 

ఇంకా కొన్ని క్షణాల్లోనే అతడి నాలుక దారుణంగా వసిపోయింది. దీంతో అక్కడికి దగ్గరలో ఉన్న ఓ వైద్యుడు హుటాహుటిన వెళ్లి అతడికి చికిత్స అందించారు. ఇంకా అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. ఇంకా ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: