ఒకప్పుడు చైనా వస్తువులంటే అందరు అమితంగా ఇష్టపడే వారు.. ఎందుకంటే తక్కువ ధరకు వస్తున్నాయని.. కానీ కరోనా వైరస్ వల్ల చైనా అంటేనే ప్రపంచానికి అసహ్యం ఏర్పడింది.. ఈ వైరస్ వల్ల చాలా దేశాలు చైనాకు వ్యతిరేకంగా మారాయి.. ఇప్పటికి ఈ కరోనా ప్రపంచానికి పరిచయం చేయబడి సుమారుగా ఎనిమిది నెలలు అవుతున్నా దీని తీవ్రత తగ్గకపోగా రోజు రోజుకు విసృతంగా వ్యాపిస్తూ ప్రజల జీవితాల మీద కోలుకోని దెబ్బ వేసింది.. ఈ క్రమంలో అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చగా, ఆ గొడవల్లోకి భారత్‌ను లాగింది చైనా.. ఇదే కాకుండా అధికార దాహంతో మిగతా దేశాల మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బ్రిటన్‌పై కయ్యానికి కాలు దువ్వుతుంది..

 

 

ఈ నేపధ్యంలో ముప్ఫయి లక్షల మంది హాంకాంగ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ తలుపులు తెరవగా, ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ చైనా మండిపడింది. అంతే కాకుండా బ్రిటన్‌పై బదులు తీర్చుకుంటామని చైనా బెదిరింపులకు దిగడంతో.. ప్రస్తుతం కరోనా వైరస్‌తో తల్లడిల్లుతున్న ప్రపంచంలో ఈ హాంకాంగ్ సంక్షోభం దౌత్య పరీక్షగా మారింది. ఇకపోతే హాంగ్‌కాంగ్ ప్రాంతాన్ని చైనాకు తిరిగి అప్పగించే సమయంలో.. ఆ ప్రాంతానికి 50 ఏళ్ల పాటు నిర్దిష్ట స్వాతంత్రం అందించేలా 1997లో చేసుకున్న ఒప్పందాన్ని కాపాడాలని చైనాకు బ్రిటన్ విజ్ఞప్తి చేసింది.

 

 

అయితే హాంగ్‌కాంగ్‌లో కొత్త చట్టం విధించటం పట్ల అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. కాగా గత వారంలో అమలులోకి తెచ్చిన ఈ చట్టం.. హాంగ్‌కాంగ్ భూభాగంలో, వేర్పాటు, విద్రోహం, ఉగ్రవాదాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ నేరాలకు గాను గరిష్టంగా జీవితఖైదు  విధించే అవకాశం ఉంది. ఇకపోతే చైనా అమలులోకి తెచ్చిన కొత్త చట్టం వల్ల హాంగ్‌కాంగ్ మీద గతంలో చైనాకు లేని విస్తృత అధికారాలు లభించడమే కాకుండా, వేర్పాటు చర్య, కేంద్ర ప్రభుత్వం పట్ల విద్రోహం, ఉగ్రవాదం, విదేశీ లేదా బయటి శక్తులతో కుమ్మక్కు వంటి పనులన్నీ నేరాలుగా పరిగణించబడతాయి..

 

 

ఇదేగాక అనుమానితుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి, నిందితుల మీద రహస్య విచారణలు చేపట్టి, వారిని చైనా అధికారులు కూడా విచారించే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది.. ముఖ్యంగా ఈ చట్టంలోని ఏవైనా అంశాలకు హాంగ్ కాంగ్‌లోని ఏవైనా చట్టాలకు మధ్య తేడాలు ఉన్నట్లయితే చైనా చట్టానికే ప్రాధాన్యత లభిస్తుంది. చైనాకే సమస్త అధికారం ఉంటుంది.. ఒక రకంగా చైనాకు, హంగ్‌కాంగ్ బానిసగా మారిపోతుంది.. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్దితుల్లో అన్ని దేశాలు కలిసి స్వార్ధంతో ఆలోచించకుండా, ప్రపంచ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, చైనా తోకముడిచేలా చర్యలు తీసుకుంటే గానీ ఈ దేశానికి బుద్ధిరాదని కొందరు అభిప్రాయపడుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: