ఒక్క మనదేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో మన హిందూ దేవుళ్లను పూజిస్తుంటారు. అయితే ఇక్కడ మనకు దేవుళ్ళు అయినా రూపాలు అక్కడ బొమ్మలాలా మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడా మనం ఎంతో నమ్మకంతో పూజించే విగ్రహాలను వారు షోకు ఉపయోగిస్తారు. అవి చూస్తే మన మనోభావాలు దెబ్బ తింటాయి. 

 

అలానే మన హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది దక్షిణ కొరియాకు చెందిన‌ సంగీత బృందం బ్లాక్‌పింక్‌. ఎం చేసింది? అసలు అంతగా ఏమైంది అని అనుకుంటున్నారా? అదేనండి.. దక్షిణ కొరియాకు చెందిన‌ సంగీత బృందం బ్లాక్‌పింక్‌కు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది అభిమానులున్నారు. 

 

ఎన్నో కోట్లమంది అభిమానులు బ్లాక్ పింక్ నుంచి ఎప్పుడు కొత్త మ్యూజిక్ వీడియోలు వస్తాయా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఇంకా ఈ నేపథ్యంలోనే బ్లాక్‌పింక్ తాజాగా ఒక కొత్త వీడియో సాంగ్‌ను విడుదల చేసారు. అయితే మ్యూజిక్ వీడియో వైర‌ల్‌గా అవ్వడమే కాదు వివాదాల‌ను కూడా తీసుకొచ్చింది. 

 

 

ఇంకా ఈ పాటకు వ్యూస్ అయితే రికార్డులు బద్దలు కొట్టాయి. అయితే వ్యూస్ విషయంలో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాయో అలానే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే హిందువులు భ‌క్తితో పూజించే గ‌ణేశుని విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగిందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. 

 

ఈ వీడియోను చూసిన హిందువులు బ్లాక్‌పింక్ సంగీత బృందంపై హ్యాష్‌ట్యాగ్‌ల‌తో నిర‌స‌న‌ల దాడి ప్రారంభించ‌డంతో ఆ మ్యూజిక్ ట్రూప్ దిగిరాక త‌ప్ప‌లేదు. ఆ పాట‌లో గ‌ణేశుని విగ్ర‌హం క‌నిపించే భాగాన్ని క‌వ‌ర్ చేసి, త‌మ త‌ప్పు సరిదిద్దుకుంది. దీంతో హిందువుల నిర‌స‌నల‌ దాడి స‌ద్దుమ‌ణిగింది. ఏది ఏమైనా గణేశుని విగ్రహం పెట్టకపోయింటే ఇంకా బాగుండేది.               

 

మరింత సమాచారం తెలుసుకోండి: