చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచం మొత్తం చుట్టేసింది.. మొన్న ఒక్కరోజే దారుణంగా  2,12,000 కొత్త కేసులు నమోదవగా,  3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.  అగ్రరాజ్యం అమెరికాలో నిన్న 40వేలకు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసులు 30 లక్షలకు చేరువలో ఉన్నది. ఈ వైరస్‌ వల్ల 1,32,569 మంది మరణించారు. అత్యధిక కరోనా కేసుల జాబితాలో నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న రష్యాను భారత్‌ వెనక్కి నెట్టివేసింది.  ఈ వైరస్‌ వల్ల 19,700 మంది బాధితులు మృతిచెందారు. రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,251కి చేరగా, 10,161 మంది చనిపోయారు.

 

ఐదోస్థానంలో ఉన్న పెరూలో 3,02,718 మంది కరోనా బారినపడగా, 10,589 బాధితులు చనిపోయారు. దేశంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు. అయితే కరోనా తో ఎక్కువ శాతం మరణించిన వారిలో వృద్దులు, కొన్ని రకాల అనారోగ్యంతో ఉన్నవారని అంటున్నారు.

 

మరోవైపు డి-విటమిన్‌ లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సమృద్ధిగా డి-విటమిన్‌ ఉన్న వారికి కరోనా వచ్చినా.. త్వరగానే కోలుకుంటున్నట్లు తేలింది. కరోనా మృతుల్లో అధిక శాతం వారేనని, డి-విటమిన్ సమృద్ధిగా ఉన్న వారు త్వరగా కోలుకుంటున్నట్లు నిపుణులు తెలిపారు. తాజాగా కాగా.. గ్రేటర్‌ వాసులే ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం గమనార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: