ట్రంప్ వచ్చాక అమెరికాలో ఇండియన్స్ కు ఇబ్బందులు పెరిగాయి. చివరకు ఇండియన్ విద్యార్ధులకు కూడా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో విదేశీయులకు ఉద్యోగ అవకాశాల్లో ట్రంప్ కోత పెడుతున్న సంగతి తెలిసిందే. వీసాల విధానంలోనూ ఆంక్షలు పెడుతూ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. 

 


అలాంటి అమెరికా ఇప్పుడు  మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు అక్కడి యూనివర్శీటీలు, కాలేజీలలో చేరి విద్య నభ్యసించాలంటే కాలేజీలకు హాజరు కావల్సిందేనని కొత్త రూల్ తీసుకొచ్చింది. అసలే కరోనా.. అందుకే చాలా విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నాయి. చాలా మంది విద్యార్థులు కూడా వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే.. ఆన్ లైన్ క్లాస్ లకు ఒప్పుకుంటే విదేశీ విద్యార్దులు దేశం విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. 

 

IHG


అంతే కాదు.. చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్న విద్యాసంస్థకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. ఆన్ లైన్ సంస్థలను అంగీకరించబోమని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 

 


ఇప్పుడు ఈ ప్రకటన విదేశీ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. తాజాగా ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయం వీరిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో ఇది ఎన్నికలపైనా ప్రభావం చూపుతోంది. అందుకే డెమోక్రాట్లు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ విదేశీ విద్యార్థులకు అండగా ఉంటామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: