ముందు నుండి పార్టీకి పక్కలో బల్లెం లాగా మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ పై జగన్ గట్టిగానే దృష్టిపెట్టినట్లు పార్టీ లో టాక్ నడుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే లపై ఓ వర్గం మీడియా కి కావాలని ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ ఇస్తూ అవినీతి ఆరోపణలు చేయడంతో ఇటీవల పార్టీ రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసులు పంపటం అందరికీ తెలిసిందే. తనకి పంపిన నోటీసుల విషయంలో పార్టీ పేరు విషయంలో సరైన స్పష్టత లేదని రఘురామకృష్ణంరాజు కూడా వైసీపీ హైకమాండ్ ధీటుగానే వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో రఘురామ కృష్ణంరాజు పై ఎలాగైనా అనర్హత వేటు వేయటానికి జగన్ పార్టీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.

IHG's ire for ...

అయితే అనర్హత వేటు రఘురామ కృష్ణం రాజు పై పడాలంటే చాలా టైం పడుతుంది. ఇలాంటి తరుణంలో స్పాట్ లోనే గట్టి ఎఫెక్ట్ రఘురామకృష్ణంరాజు కి ఇవ్వడానికి జగన్ స్పాట్ డెసిషన్ ఇటీవల తీసుకున్నారట. అదేమిటంటే పార్టీ పదవుల నుంచి తొలగించాలని రెడీ అయ్యారట. ఇందువలన ఇటీవల పార్టీకి చెందిన నాయకులు ఎంపీలు స్పీకర్ ని పార్టీ పదవుల నుంచి రఘురామకృష్ణం రాజు ని తొలగించాలని ఆయనకు సంక్రమించిన పార్లమెంటరీ పదవుల నుంచి వైద్యులకు ఎలా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారట.

IHG

ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ సబార్డినేట్ లేజిస్టేషన్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అలాగే పబ్లిక్ అండర్ టేకింగ్స్, కోల్ స్టిల్స్ జనరల్ పర్సస్, రూల్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పదవుల నుంచి వెంటనే తప్పించాలని వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్ ని కోరటం జరిగిందట. అంతేకాకుండా రఘురామకృష్ణంరాజు ప్లేసులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ని నియమించాలని సూచించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: