కిందపడ్డా.. పైచేయి తమదే అన్నట్లుగా వ్యవహరించే క్రమంలో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఓ వ్యవహారంలో అడ్డంగా బోల్తా పడినట్లు కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అవినీతి, అక్రమ వ్యవహారాలన్నీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తవ్వి తీస్తోంది. అప్పట్లోనే టీడీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా, నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అవినీతి కార్యకలాపాల్లో పాల్గొంటున్నా, చంద్రబాబు అప్పట్లో ఈ విషయాలను తేలిగ్గా తీసుకున్నారు. అప్పట్లో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఇప్పుడు బయటపడడంతో వరుసగా టిడిపి నాయకులు జైలు బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరికొందరు అరెస్ట్ అవగా, మరికొందరు తమ నోటి దురుసు తనంతో కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక మరో మాజీ మంత్రి హత్య నేరం కేసులో లో జైలు పాలయ్యారు.

IHG

 

అయితే ఈ వ్యవహారం అన్నిటికీ కులాన్ని ఆపాదించి టిడిపి రాజకీయంగా క్రెడిట్ సంపాదించుకోవాలని, అలాగే వైసీపీ ప్రభుత్వం పై బురదజల్లడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేసింది.ప్రస్తుతం జైలుపాలైన మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు, కొల్లు రవీంద్ర విషయంలో బీసీ కార్డును టిడిపి బయటకు తీసింది. అచ్చెన్న విషయంలో ఇది కాస్త వర్కౌట్ అయినా, కొల్లు రవీంద్ర విషయంలో మాత్రం ఈ వ్యూహం దెబ్బతిన్నట్టు గా కనిపిస్తోంది. మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఉందనే విషయం బయటకు రాగానే టిడిపి నుంచి ఆయనకు సూచనలు అందాయట. హత్య కేసులో నిందితులు కూడా పోలీసులకు నిజాలు చెప్పడం, ఆ హత్య వ్యవహారంలో కొల్లు రవీంద్ర పాత్ర ఉన్నట్టుగా వారు అంగీకరించడంతో, ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చే ముందే, తాను బీసీనని కాబట్టే ఈ ప్రభుత్వం కక్ష కట్టి తనను అరెస్టు చేస్తోందని మీడియా ముందు హడావుడి చేయాలని పార్టీ నుంచి సూచనలు వచ్చాయి.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MURDER.' target='_blank' title='murder-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>murder</a> case — IND News

ఆ విషయం ఆయన పక్కనపెట్టి, పోలీసులు రావడం చూసి గోడదూకి పారిపోవడం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, తుని వద్ద ఆయనను అరెస్టు చేయడం వంటి వ్యవహారాలు జరిగిపోయాయి. ఈ విషయంలో టిడిపి ప్లాన్ ప్రకారం ఆయన బీసీ కాబట్టే ఇలా చేస్తున్నారు అని హడావుడి చేసి ఉంటే, ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి మైలేజ్ దక్కడంతో పాటు, కొల్లు రవీంద్ర కు సానుభూతి పెరిగేది. అలా చేయకుండా, ఆయన గోడ పారిపోవడంతో ఈ హత్య కేసులో తన ప్రమేయం ఉందనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నట్లు అయిందని, ఇప్పుడు టిడిపి మదన పడుతోంది. కొల్లు రవీంద్ర గోడదూకి పారిపోయి ఉండకపోతే ఈ విషయాన్ని బాగా హైలెట్ చేసి, వైసీపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకు ఉపయోగించుకునేవారమని, కానీ తమ ప్లాన్ మొత్తం రవీంద్ర పాడు చేశారని ఆగ్రహం తో టిడిపి అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: