ఈ మద్య కొంత మంది కంత్రీ గాళ్లు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.  సైబర్ నేరగాళ్ళు అయితే అకౌంట్లు హ్యాక్ చేసి ఈజీగా మని సంపాదిస్తున్నారు. అయితే వీరి టార్గెట్ మొత్తం అమాయకులు మాత్రమే.  కొంత మంది కేటుగాళ్లు మైనర్ బాలికలతో సోషల్ మాద్యమాల ద్వారా పరిచయాలు పెంచుకుంటారు... వారిని ఊహాలోకాల్లో ఊరేగిస్తుంటారు.  ఇక చేప వలలో చిక్కిందని తెలిస్తే చాలు.. వారి రంగు బయట పెడుతుంటారు. ఇలాగే ఓ మైనర్ బాలిక సోషల్ మాద్యమం ద్వారా ఓ యువకుడికి పరిచయం అయ్యింది. ఆ యువకుడు చెప్పిన మాటల్లో పడిపోయింది.  అంతే ఆ బాలికను నమ్మించి కిడ్నాప్ చేశాడు. అతని తో పాటు మరో నలుగురు ఇందుకు సహకరించారు. ఈ ఘటన ముంబైలో జరిగింది.

 

ముంబై నగరంలోని ఓ ప్రాంతంలో నివాసముండే బాలిక(13)కు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. బాలికను నమ్మించిన అతడు మధ్యప్రదేశ్ నుంచి మరో నలుగురిని రప్పించి వాహనంలో ఆమెను అపహరించాడు.  అయితే తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు స్వీకరించిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికతో ఎవరికి పరిచయాలు ఉన్న విషయం పై ఆరా తీశారు. గత కొంత కాలంగ ఓ యువకుడితో పదే పదే చాటింగ్ చేసినట్లు బయట పడింది. అంతే వెంటనే ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

 

దాంతో ఆ యువకుడి అడ్రస్ ని పట్టుకున్నారు. వెంటనే ఆ నిందితులు రాజస్థాన్‌లోని జాలవర్‌, రాజ్‌ఘర్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, బాలికను క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చామని పోలీసులు తెలిపారు. అయితే మైనర్టీ తీరకుండా ఇలాంటి చాటింగ్స్ చేసే సమయంలో పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లు ఏం చేస్తున్నారన్న విషయం పై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని పోలీసులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: