సాధారణంగా మనం ఎన్నో సినిమాల్లో చూశాం.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చనిపోయే వరకు కూడా తన డ్యూటీ నిబద్దతతో చేస్తుంటాడు. కొంత మంది పోలీసులు గురించి ఎప్పుడు నెగిటీవ్ గా వచ్చినా.. డిపార్ట్ మెంట్ లో తమ ప్రాణాలకు లెక్కచేయకుండా డ్యూటీలు చేసేవారు ఉన్నారు.  పోలీసుల రక్షణ లేకుండా ఏ పౌరుడు కూడా స్వేచ్చగా ఉండలేరన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ పోలీస్ తాను చనిపోతున్న అన్నవిషయం తెలిసి కూడా తన డ్యూటీ చేసి నింధితులను పట్టుకునేలా చేశాడు.  ఈ ఘటన  హరియాణా రాష్ట్రంలోని బుటానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుటానా దగ్గరలో ఉన్న సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొందరు దుండగులు తమ కారును పార్క్ చేసి రోడ్డుపైనే మద్యం తాగుతున్నారు. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్‌ కప్తాన్‌ సింగ్(43), రవీందర్‌ సింగ్(28)‌ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. 

 


ఆ దుండగులు రెచ్చిపోయారు.. కానిస్టేబుల్స్ పై విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఈ ఘర్షణలో రవీందర్‌ సింగ్‌, కప్తాన్‌ సింగ్‌ అక్కడికక్కడే మరణించారు. చనిపోయే ముందు రవీందర్‌ సింగ్‌ తన చేతిపై దుండగుల కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ని రాసుకున్నాడు. పోలీసులు రవీందర్‌ చేతి మీద ఉన్న రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా విచారణ చేపట్టి దుండగులను వెంటనే పట్టుకున్నారు. 

 


ఈ సందర్భంగా ‌ రవీందర్‌ సింగ్ చూపించి తెగువ గురించి హరియాణా పోలీసు చీఫ్‌ మనోజ్‌ యాదవ్ మాట్లాడుతూ.. చనిపోయే ముందు మా పోలీస్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌ సింగ్‌ చూపిన సమయస్ఫూర్తి అభినందనీయం. చనిపోయే ముందు రవీందర్‌ సింగ్‌ హంతకుల కారు నంబర్‌ని తన చేతి మీద రాసుకున్నాడు. లేదంటే నిందితులను పట్టుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది అన్నారు. అయితే  ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురుని అరెస్ట్‌ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: