గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా పడగ విప్పుతుంది.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది.  ఒక్క రోజులో 11 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 306కి పెరిగింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కంటే నేడు డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా 2,078 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 10,646 మంది చికిత్స పొందుతున్నారు.  మొన్నటి వరకు వందలైతే.. ఇప్పుడు ఆ సంఖ్య వేలకు పెరుగుతుంది. తాజాగా కరోనా వారియర్స్‌ను కూడా కరోనా విడిచిపెట్టడంలేదు. ఇప్పటిటే పలువురు డాక్టర్లు, పోలీసులు కరోనా మహమ్మారి భారిన పడి చనిపోయారు.

 

తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో పని చేస్తున్న ఓ హోంగార్డు కరోనాతో మృతిచెందారు. 56 ఏళ్ల మహ్మద్ అసదుద్దీన్‌ సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ ఆఫీసులో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు.  జూన్ 28న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  అప్పటి నుంచి హోంగార్డు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. సోమ‌వారం ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో.. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

 

గాంధీలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుది శ్వాస విడిచాడు హోంగార్డు.ఆయన మృతి పట్ల పలువురు పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోంగార్డు కుటుంబానికి అన్ని విధాలా పోలీసు డిపార్ట్‌మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే మాస్క్ లు లేకుండా ఎవరు బయట తిరిగినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీస్ అధికారులు అంటున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: