గల్వాన్‌ లోయలో రెండు నెలల క్రితం నుంచి చైనా ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. చివరకు గల్వాన్ ఘర్షణలో భారతీయ సైనికులు 20 మంది అమరులయ్యారు. చైనా వైపు నుంచి అంత కంటే ఎక్కువ మందే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణ తర్వాత కూడా చైనా కుయుక్తులు పన్నింది. సరిహద్దుల్లోకి సైన్యాన్ని మోహరించింది. అయితే..జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ రంగప్రవేశంతో సీన్ మారిపోయింది. 

 

 


అజిత్ చొరవతో రెండు దేశాలు శాంతి చర్చలు ప్రారంభించాయి. ఆ చర్చలు ఫలించి చైనా బలగాలు తొలిసారిగా  ఒక కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లాయి.  రెండు దేశాలు వాస్తవాధీన రేఖను గౌరవించాలని అంగీకారానికి వచ్చాయి. ఏ దేశం ఏకపక్ష చర్యలకు దిగకూడదని అంగీకారానికి వచ్చాయి. అయితే ఇప్పుడు చైనా ప్రభావం నేపాల్ పైనా పడింది. 

 

IHG

 


అవును నిన్న మొన్నటి వరకూ మన పక్కనే ఉన్న చిన్న దేశం నేపాల్ కూడా ఇండియాను కవ్వించింది. మన దేశంలోని కొన్ని ప్రాంతాలను తన దేశంలో ఉన్నట్టు చూపుతూ కొత్త మ్యాప్ రూపొందించింది. దాన్ని వాళ్ల పార్లమెంట్‌లోనూ ఆమోదించింది. అయితే.. లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయవద్ద  నుంచి భారత్‌, చైనా బలగాలు వెనక్కిమళ్లడంతో సీన్ మారిపోయింది. 

 

 


ఇప్పుడు భారత్‌-నేపాల్‌ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంలోనూ సానుకూల పరిణామం చోటు చేసుకొంది. మొన్నటి వరకూ భారత్‌లోని కాలాపానీ ప్రాంతం తమదే అంటూ నేపాల్‌ హడావుడి చేసింది. భారత్‌ నేపాల్‌ సరిహద్దుల్లో కొత్తగా ఆరు చెక్‌పోస్టులు ప్రారంభించింది. ఇప్పుడు చైనా వెనక్కి తగ్గడంతో నేపాల్ కూడా దారి కొచ్చింది. నేపాలీ సశస్త్ర ప్రహారీ నిర్వహిస్తున్న రెండు పోస్టులను తొలగించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: