జగన్ని తక్కువ అంచనా వేసినా లేక ఆయన గురించి తప్పుడు ప్రచారం చేసినా కూడా అది తాత్కాలిక  ఆనందమే. జగన్ ఏంటన్నది మబ్బులు విడిచిన సూర్యుడు అంతటి స్వచ్చంగా, సత్యంగా ఆ వెనువెంటనే అందరికీ తెలుస్తుంది. ఇదంతా ఎందుకంటే రాజకీయాల్లో అబద్దాలు ప్రచారం చేసి జనాలను మభ్యపెడదామనుకునే వారికి నిలువెత్తు హెచ్చరికగా జగన్ రాజకీయ వ్యక్తిత్వం ఉంటుందని చెప్పడానికి.

 

విశాఖలో సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే రోజు అంటే మే 7న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి 12 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు.ఆ తరువాత మరో ముగ్గురు కూడా ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయన్న భయం ఎందరికో ఉంది. ఇప్పటికీ అస్వస్థతతో అవస్థలు పడుతున్న వారు ఉన్నారు. వీటికి కారణం ఎల్జీ పాలిమార్స్ యాజమాన్యం. అది ఆ రోజు అందరూ అన్నారు.

 

కానీ అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నాడు హై పవర్ కమిటీ విచారణకు నియమించింది. ఆ తరువాత బాధితులకు కోటి రూపాయలు వంతున పరిహారం భారీగా ప్రకటించింది. ఇక వెంకటాపురం పరిసర అయిదు గ్రామాలలో ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. ఇదంతా చేసినా కూడా జగన్ సర్కార్ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో కుమ్మక్కు అయింది అని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఇతర పక్షాలు కూడా యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయరని నిగ్గదీశారు. వారితో  అవగాహన ఉంది కాబట్టే కిమ్మకన ఉన్నారని కూడా ఆడిపోసుకున్నారు.

 

అయితే జగన్ అపుడు చెప్పారు. విచారణకు కమిటీని వేశాం, నివేదిక రాగానే చర్యలు ఉంటాయని, దాని ప్రకారం ఈ నెల 6న జగన్ చేతికి హై పవర్ కమిటీ నివేదిక వచ్చింది. అందులో యాజమాన్యం తప్పు పూర్తిగా ఉందని, నిర్లక్ష్యం వల్లనే ఇంతా చేశారని ఉంది. దాంతో నివేదిక వచ్చి 24 గంటలు గడవక ముందే జగన్ మార్క్ యాక్షన్ స్టార్ట్ అయింది.

 

ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మందిని ఎల్జీ యాజమాన్యం తరఫున జగన్ సర్కార్ అరెస్ట్ చేసింది. ఇపుడు టీడీపీ ఏమంటుందో మరి అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమే అని అంటున్నారు. నిజంగా జగన్ ఈ విషయంలో తాను ఏం చెప్పారో అదే చేస్తున్నారు. ఆయనన్ని జనం అందుకే నమ్ముతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: