మ‌న‌దేశంపై డ్రాగ‌న్ కుట్ర‌లు ఆగ‌డం లేదు. స‌రిహ‌ద్దుల్లో కుట్ర‌లు చేసి మ‌న సైనికుల‌ను పొట్ట‌న పెట్టుకున్న చైనాకు మ‌నం చెప్పిన గ‌ట్టి బుద్ధితో వెన‌క్కుత‌గ్గిన సంగ‌తి తెలిసిందే. అయితే, మ‌రో రూపంలో మ‌నల్ని త‌న గుప్పిట్లోకి పెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. భారత కంపెనీల్లోని వాటాలను హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు భారత సంస్థల షేర్లను చైనా బ్యాంకులు దక్కించుకున్నాయి. అయితే, దీనికి  తాజాగా షాక్ త‌గిలింది. 

 


కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు 1% కంటే ఎక్కువ ఉన్న పెట్టుబ‌డుల విష‌యంలో ఆర్‌బీఐకి స‌మాచారం ఇవ్వాల్సి ఉండేది. అయితే, ఈ ష‌ర‌తు ఆధారంగా చైనా కంపెనీలు కీలక పెట్టుబడులు పెట్టాయి. 2018 జూలైలో ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన చైనా సెంట్రల్ బ్యాంకు దేశంలోని పలు బాడా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టింది. దేశంలోని జర్మనీ తయారీ కంపెనీతోపాటు దేశీయ ఎరువుల ఉత్పత్తి సంస్థలో ఆ బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ)కు హెచ్ఎఫ్‌డీసీలో 1.01 శాతం వాటా ఉన్నది. రూ.3,100 కోట్ల విలువైన షేర్లను ఆ బ్యాంకు కలిగి ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ విషయాన్ని ఆ సంస్థ బయటపెట్టింది. అలాగే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు పిరమల్ ఎంటర్ ప్రైజెస్ లో 0.43 శాతం (రూ.137 కోట్లు) ,  అంబుజా సిమెంట్స్‌లో 0.32 శాతం (రూ.122 కోట్ల) వాటాలున్నాయి. అయితే చైనా బ్యాంకులు కలిగిన వాటాలు, షేర్లు 1 శాతం పరిమితిలోపే ఉన్నాయి. దీంతో ఆయా కంపెనీలు వీటిని బహిరంగ‌పర్చాల్సిన అవసరం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా చైనా వాటాల గురించి పెద్దగా తెలియదు. 

 

కాగా, ఏప్రిల్‌ 12న స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలిపిన వివరాల్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు  తమ సంస్థలో 1.01 శాతం వాటా ఉన్నట్లు హెడీఎఫ్‌డీసీ పేర్కొనడం కలకలం రేపింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం, భారత్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఏప్రిల్ 17న సవరించింది. భారత్‌తో సరిహద్దు కలిగి ఉన్న దేశాల నుంచి భారత కంపెనీల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. అయితే ఇంతకు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు మాత్రమే ఈ నిబంధన వర్తించేది. కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా సవరణతో ఆ జాబితాలో చైనా కూడా చేరింది. దీంతో ఇకపై చైనా బ్యాంకులు, సంస్థలు భారతీయ కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టే వీలు లేదు. మ‌న నిబంధనల‌ను ఆసరాగా చేసుకుంటున్న చైనా బ్యాంకులు మరిన్ని భారత సంస్థల్లో వాటాలు, షేర్లు దక్కించుకునే ప్రయత్నాలు చూసి నిపుణులు షాక్ తింటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: