జగన్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారా? విడివిడిగా ఉంటూనే...కలిసి రాజకీయం చేస్తున్నారా? నెక్స్ట్ ఎన్నికలకు టీడీపీ-జనసేనలు పొత్తుతో ముందుకెళ్లడం ఖాయమేనా? అంటే ఏ మాత్రం మొహమాటం లేకుండా అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు చేసే రాజకీయంలో పవన్ సహకారం ఎప్పుడూ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.

 

2014 ఎన్నికల్లో వీరి కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అప్పుడు పవన్ పార్టీ జనసేన డైరక్ట్‌గా పోటీలో దిగకుండా టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది. కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ-జనసేనలు విడివిడిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాయి. అయితే విడివిడిగా పోటీ చేసి ఓట్లు చీల్చి జగన్ దెబ్బతీయడానికి చూశారని, అందుకే చాలా నియోజకవర్గాల్లో బాబు-పవన్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేశారని వైసీపీ శ్రేణులు గట్టిగా చెబుతాయి. వైసీపీ శ్రేణులు చెప్పడమే కాదు వాస్తవానికి ఎన్నికల్లో అలాగే జరిగింది.

 

కాకపోతే వారి ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. ఇక జగన్ సీఎం అయ్యాక కూడా, బాబు-పవన్‌లు ఒకే బాటలో పయనిస్తున్నారని బాగా అర్ధమవుతుంది. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఎలాంటి విమర్శలు చేస్తారో....అలాగే పవన్ కూడా చేస్తారు. ఇదంతా విడివిడిగా ఉంటూ చేస్తున్నారు.   అయితే నెక్స్ట్ ఎన్నికల ముందు వరకు వీరు ఇలాగే నడుస్తారని తెలుస్తోంది. కానీ ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా పొత్తులో దిగడం ఖాయమని కొందరు తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు.

 

రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే జగన్‌కు చెక్ పెట్టగలరని, లేదంటే నెక్స్ట్ కూడా జగన్ సీఎం అవ్వడం ఖాయమని అంటున్నారు. 2019 ఎన్నికల్లోనే కలిసి పోటీ చేస్తే, కనీసం 50 సీట్లు వరకు వచ్చేవని, చాలాచోట్ల టీడీపీ ఓట్లని జనసేన చీల్చడం వల్ల అది వైసీపీకి ప్లస్ అయిందని, ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇదే జరిగిందని వివరిస్తున్నారు. అలాగే పవన్ కూడా రెండుచోట్ల గెలిచేవారని చెబుతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో తప్పనిసరిగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని, అప్పుడు జగన్‌కు గట్టి పోటీ ఇస్తారని తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. మరి బాబు-పవన్ కలిసొచ్చిన జగన్‌కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: