నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఏపీ ప్రజలకు ఓ క్లారీటీ వచ్చేసింది. ఆయన వైసీపీ నుంచే ఎంపీగా గెలిచినా, టీడీపీ-బీజేపీలకు అనుకూలంగా ఉన్నారని పక్కగా అర్ధమైపోతుంది. అయితే ప్రస్తుతానికి అధికారికంగా ఆయన వైసీపీ ఎంపీగానే ఉన్నారు. ఒకవేళ లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు వేస్తే అప్పుడు ఆయన మాజీ ఎంపీ అవుతారు. కానీ అదే జరిగే పనేనా అంటే? ఏమో కష్టమే అని చెప్పొచ్చు. 

 

ఎందుకంటే రాజుగారికి ఢిల్లీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయనపై అనర్హత వేటు పడటం అనేది జరగని పని. అయితే అధికారికంగా అనర్హత వేటు పడకపోయినా, అనధికారికంగా నరసాపురం ప్రజల దృష్టిలో ఆయన ఎంపీ పదవి ఎప్పుడో పోయింది అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయనకు సొంత సామాజికవర్గమైన రాజుల సపోర్ట్ కూడా లేదు.

 

మామూలుగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో రాజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండే రాజులు, పార్టీల గెలుపోటములని డిసైడ్ చేయగలరు. 2014 ఎన్నికల్లో వీరు ఎక్కువగా టీడీపీ వైపు ఉండటంతో, పార్టీ వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పట్టించుకోకపోవడంతో, 2019 ఎన్నికల్లో రాజులు జగన్‌కు సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేయడం వల్లే నరసాపురం బరిలో రఘురామకృష్ణం రాజు విజయం సాధించగలిగారు.

 

అదే సామాజికవర్గానికి చెందిన శివరామరాజు టీడీపీ తరుపున పోటీలో ఉన్నా సరే, రాజులు వైసీపీకే సపోర్ట్ చేసి రఘుని గెలిపించుకున్నారు. కానీ వైసీపీ నుంచి గెలిచాక రఘు...జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వస్తున్నారు. దీంతో రాజులు రఘుని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రఘు అనవసరమైన రాజకీయాలు చేస్తూ జగన్‌కు వ్యతిరేకమై, బీజేపీకి సపోర్ట్‌గా ఉన్నా పెద్ద ఉపయోగం లేదని చెప్పి, వెస్ట్‌లోనే మెజారిటీ రాజులు జగనే వైపే ఉండటం బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: