బాబోయ్ బీసీలపై జగన్ మోహన్ రెడ్డి కక్ష కట్టారు. కావాలనే బీసీ నాయకులని వేధిస్తున్నారు. తమ బీసీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెట్టేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు అరెస్ట్ కావడం, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడులపై కేసులు నమోదు కావడంతో బాబు బీసీ రాజకీయం చేసేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా జనాల్లో సింపతీ కొట్టేయడం కోసం బాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఈక్రమంలోనే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ని ఉపయోగించుకుని శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రామ్మోహన్ నాయుడుని అడ్డం పెట్టుకుని, సానుభూతి రాజకీయాలకు తెరలేపారు. అచ్చెన్నా అరెస్ట్ కాగానే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలందరూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, కుల రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు. అటు ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండే రామ్మోహన్ కూడా అలాగే నడుచుకున్నారు.

 

ఆయన మీడియాతో మాట్లాడిన ప్రతిసారి తన బాబాయ్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని, బీసీలని జగన్ అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడును ఎలాగైనా జైల్లో పంపాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారని, దీనిపై పోరాటం చేస్తామని హడావిడి చేశారు. అయితే ఈ విధంగా చంద్రబాబు, రామ్మోహన్ నాయుడులు రాజకీయం చేస్తూ, సిక్కోలు ప్రజల సానుభూతి పొందాలని ట్రై చేస్తున్నారు. కానీ వీరు ఏ విధంగా ట్రై చేసినా...సిక్కోలు ప్రజలు జగన్ వైపు నుంచి వచ్చేలా కనబడటం లేదు.

 

అచ్చెన్నని జగన్ అక్రమంగా అరెస్ట్ చేశారనే భావన సిక్కోలు ప్రజల్లో లేదని తెలుస్తోంది. ఆయన తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్ళారని, అందులో జగన్‌ని తప్పుబట్టడానికి ఏం ఉందన్నట్లు సిక్కోలు ప్రజలు చర్చికుంటున్నారు. ఆఖరికి అచ్చెన్న సొంత నియోజకవర్గమైన టెక్కలిలోని ప్రజలు కూడా టీడీపీకి అనుకూలంగా లేరని తెలుస్తోంది. మొత్తానికైతే బాబు ఆధ్వర్యంలో రామ్మోహన్ నడిపిన ప్లాన్ వర్కౌట్ కాలేదని అర్ధమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: