తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాసివ్ ఇమేజ్ వైఎస్ సొంతం. ఎన్టీఆర్ కు సినిమా ఛరిష్మా వల్ల పాలిటిక్స్ లో కూడా అదే ఇమేజ్ కంటిన్యూ అయింది. కానీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి నుంచీ రాజకీయ నాయకుడే. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన కేవలం రాజకీయాల్లోనే అంతటి మాసివ్ ఇమేజ్ సాధించడం విశేషం. 1999 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వైఎస్ పేరున్న నాయకుడు మాత్రమే. కానీ.. రాష్ట్రంలో ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర ఓ సంచలనం. ఆయనలోని ధీరత్వం, క్రేజ్, ఇమేజ్.. మొత్తం అదే పాదయాత్రలో రాష్ట్రానికి తెలిసింది.

IHG

 

ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టింది. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు, సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కొన్న తీరు ఇప్పటికీ ప్రజలకు గుర్తే. అసెంబ్లీలో ఆయన మాటల తూటాలే పేల్చారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న చంద్రబాబును ఆయన చిరునవ్వుతో ఢీకొట్టిన సందర్భాలు కోకొల్లలు. ‘కూర్చోవయ్యా.. కూర్చో..’ అంటూ ఆయన గంభీర స్వరంతో నవ్వుతూ పలికిన మాటలు ఇప్పటికీ యూట్యూబ్ లో రౌండ్ అవుతూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డిని అసెంబ్లీ టైగర్ అనొచ్చు. ప్రతిపక్షాలకు ఆయనిచ్చే సమాధానాలు భయాన్ని.. స్వపక్షాలకు ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేవంటే అతిశయోక్తి కాదు.

IHG

 

వరుసగా రెండో పర్యాయం కూడా ఎన్నికల్లో నెగ్గి సీఎం అయిన అసలైన ప్రజల మనిషి వైఎస్. ‘నేను గెలిపించుకుంటాను’ అనే ఒక్కమాట మాత్రమే ఆయన చెప్పారు. అన్నట్టే 2009లో కాంగ్రెస్ ను మళ్లీ గెలిపించుకుని రెండోసారి సీఎం అయ్యారు. మరో ఐదేళ్లు వైఎస్ రాజకీయాలను శాసిస్తారనుకున్న వారికి ఊహించని షాక్ ఇచ్చి గుండెలు బరువెక్కించారు. ప్రజల మధ్య ఆయన లేకపోయినా తనయుడు జగన్ రూపంలో ఆయన ప్రజల మధ్యే ఉన్నారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: