తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్ తోపాటు ఇతర జిల్లాలోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1850 పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అందులో అత్యధికంగా జిహెచ్ఎంసిలో 1422,రంగారెడ్డిలో176 ,మేడ్చల్ లో 94 కేసులు బయటపడ్డాయి.
 
వీటి తరువాత మరో రెండు జిల్లాల్లో భారీగా కేసులు బయటపడ్డాయి. అందులో కరీంనగర్ లో 32,నల్గొండలో 31 కేసులు వచ్చాయి. ఈరోజు మొత్తం 6220శాంపిల్ టెస్టులు చేశారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 27612కరోనా కేసులు నమోదవ్వగా అందులో16287మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం11012కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనాతో 7గురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 313కు చేరింది.  
 
ఇక దేశ వ్యాప్తంగా ఈరోజు కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి అందులో ఒక్క మహారాష్ట్ర లోనే 5134 కేసులు నమోదు కాగా ఢిల్లీలో 2008, తమిళనాడులో 3616 కేసులు బయటపడ్డాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 740000కరోనా కేసులు నమోదు కాగా 20400కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో ఇండియా ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా కరోనా మరణాల్లో 8వ స్థానంలో కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: