ఎక్కడైనా సైలెంట్ గా ఉండొచ్చు కానీ, రాజకీయాలు దగ్గర మాత్రం సైలెంట్ గా ఉంటే ఇక రాజకీయంగా కనుమరుగై పోవాల్సిందే. నిత్యం ఏదో ఒక విషయంపై జనాల్లో హడావుడి చేస్తూ, పార్టీ తరపున వాయిస్ వినిపిస్తూ ఉంటేనే, రాజకీయంగా పైమెట్టు ఎక్కేందుకు సాధ్యమవుతుంది. ఇది రాజకీయ నాయకులైన, పార్టీలైన ఇదే వర్తిస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. రాజకీయంగా అన్ని విషయాలను అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదాల కారణంగానే, ఇప్పటికీ జనసేనకు కోలుకొలేని విధంగా చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.

IHG

జనసేన ను స్థాపించి అప్పుడే ఏడు సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడలేకపోయింది. గతంలో ప్రజారాజ్యం అనుభవాలు పవన్ కు ఉన్నా, ఆ తప్పిదాలే, జనసేనలో తలెత్తకుండా చూసుకోవడంలో, పవన్ విఫలమయ్యారనే చెప్పుకోవాలి. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాము అనేది పక్కన పెడితే, ఎంత ముందుకు వెళ్దామనే విషయాన్ని గుర్తించడంలో పవన్ వెనుకబడినట్టుగానే చెప్పుకోవాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఆ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోనూ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరీ, సొంతంగా జగన్ పార్టీ స్థాపించారు.

 

ఇక అప్పటి నుంచి ఆయన ఎన్నో, ఎదురు దెబ్బలు తిన్నా, ఎక్కడా వెనక్కి తగ్గకుండా, నిత్యం ఏదో ఒక విషయంతో జనాల్లో ఉండేలా, ప్లాన్ చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం, ఇలా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుకి ఉండవలసిన లక్షణాలన్నీ జగన్ కు ఉన్నాయి. మొదటి నుంచి అన్ని విషయాల్లోనూ క్లారిటీ గా ఉండడం, కష్టాలకు ఎదురీదుతూ ముందుకు వెళ్లడం వంటివి ఆ పార్టీని ఇప్పుడు అధికారంలోకి తీసుకు వచ్చాయి. కానీ ఈ విషయంలో పవన్ ఏ విధంగా వ్యవహరించాలో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. చంద్రబాబు మనిషిగా, టిడిపికి అనుకూలమైన వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. ఇప్పటికీ ఆయన టిడిపి మనిషి అన్న భావన జనాల్లోనూ ఉంది.

IHG

ఇప్పుడు ఏపీలో కరోనా, విజృంభిస్తున్న సమయంలోనూ, పవన్ ఏపీ కి సంబంధించి పార్టీ తరఫున చేయవలసిన కార్యక్రమాలు గాని, ప్రజలకు భరోసా కల్పించే విధంగా సహాయ సహకారాలు అందించే విషయంలో కానీ తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఎందుకు పెట్టుకున్నారో, అటు బిజెపి కానీ, ఇటు జనసేనకు కానీ కరిటీ లేనట్టుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే జనసేన కు సంబంధించి ఎన్నో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి ఇవన్నీ పవన్ ఎప్పటికి సరి చేసుకుంటారు ? ఎప్పటికి అధికారంలోకి వస్తారు అనేది ఆ పార్టీ నాయకులకు సైతం అంతుపట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: