ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. బెంగుళూరులో మొన్న అంబులెన్స్ కోసం నాలుగు గంటలు ఎదురు చూసి చూసి ఓ కరోనా బాధితుడు మరణించాడు కదా! ఇంకా ఆ ఘటనకు సంబంధించిన వార్తే ఇది. ఇంక మీకు పైన కనిపిస్తున్న ఫోటోలు ఒక మహిళా ముందు చేతులు ఎత్తి దండం పెడుతున్న వ్యక్తి ఓ ఐఏఎస్ ఆఫీసర్, బెంగళూరు కార్పొరేషన్ కమిషనర్. 

 

IHG

 

ఇంకా అతని ఎదురుగా ఉన్న ఆవిడే భర్తను కోల్పోయిన ఓ ఇల్లాలు. ఆ ఇల్లాలు ఎవరో కాదు నాలుగు గంటలు అంబులెన్స్ కోసం ఎదురు చూసి చూసి మరణించింది ఆమె భర్తే. అయితే అంబులెన్స్ సమయానికి వచ్చి ఉంటే అతను బ్రతికేవాడు. కానీ మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అతని భర్త చనిపోయాడు. 

 

IHG

 

ఎవరి నిర్లక్ష్యం అయినా ఆమె భర్త చనిపోయాడు. తప్పు జరిగింది. కానీ ఆ తప్పును నిజాయితీగా ఒప్పుకొని క్షమాపణ కోరడానికి కూడా దైర్యం కావాలి. ఇంకా ఈ ఐఏఎస్ ఆఫీసర్ సరిగ్గా అదే చేశారు. తన సిబ్బంది వల్ల జరిగిన పొరపాటుకు ఆయన క్షమాపణ కోరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

IHG

 

ఇంకా పైన కనిపించే ఐఏఎస్ ఆఫీసర్ పేరు బీహెచ్ అనిల్ కుమార్. బృహత్ బెంగళూరు మహానగర పాలికె కమిషనర్. ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ బాధిత కుటుంబాన్ని కలిసి క్షమాపణ కోరినట్లు కమిషనర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ''సమయానికి స్పందిచకపోవడంతో రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయిన కరోనా బాధితుడి కుటుంబసభ్యులను గవీపురంలోని ఆయన నివాసంలో కలిశాను. మా సిబ్బంది తరఫున అన్‌కండీషనల్‌గా క్షమాపణ కోరాను'' అంటూ ఆ ట్విట్ లో పేర్కొన్నారు. ఏది ఏమైనా నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పోతే.. ఆ ప్రాణం మా వల్లే పోయింది అని ఒప్పుకోవడం సాధారణ విషయం కాదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: