వైయస్సార్.. ఈ పేరులోనే ఎంతో బలముంది. ఒక మంచి నాయకుడు.. ఏళ్ళు గడిచిన అతను చేసిన మంచిపనులను ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అంత గొప్ప నాయకుడు వైయస్సార్. ప్రజలకు మంచి చేస్తే ఆ మనిషిని ప్రజలు ఎంత ప్రేమిస్తారు.. ఆ మనిషి కోసం ఎంత చేస్తారు అనేది వైయస్సార్ స్మరణలోనే ఉంది. 

 

IHG

 

ఇంకా అలాంటి గొప్ప నాయకుడు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈరోజు మహానేత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి జయంతి. వైయస్సార్ చేసిన ఎన్నో గొప్ప పనులు.. అసలు వైయస్సార్ ను చూసే వరకు తెలియదు. లీడర్ అంటే ఇంత గొప్పగా ఉంటాడా? ఒక రాజకీయనాయకుడు ప్రజలమనిషి అయితే రాష్ట్రప్రజలు ఇంత ఆనందంగా ఉంటారా అని. 

 

IHG's 7th Death Anniversary ...

 

మనకు సీఎంగా ఒక లీడర్ గా కనిపించింది 2004లో. కానీ వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు ఎంత కష్టపడ్డారో మాటలలో చెప్పలేము. 1978లో ప్రజలకు మంచి చెయ్యాలని ఉద్దేశ్యంతో రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఇక అప్పటి నుండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. 

 

IHG

 

కానీ ముఖ్యమంత్రి అవ్వడానికి 25 ఏళ్ళు పట్టింది. ఎంతో సేవ.. ఎన్నో హామీలు.. సంక్షేమం ముందుగా అడుగులు వేశారు. ఇంకా ఇప్పుడు మనం సీఎం జగన్ పాదయాత్రని చూశాం. కానీ 2003లో మండు వేసవిలో వైయ‌స్ 1467 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలైంది. వైయ‌స్ పాదయాత్రలో ఎంతోమంది కష్టాలను చూసి చెలించిపోయి ప్రతిఒక్కరికి న్యాయం జరిగేలా అయన చేశాడు. సంక్షేమం అంటే వైయస్సార్.. వైయస్సార్ అంటే సంక్షేమం అనేంతలా అయన అభివృద్ధి చేశాడు. తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశాడు వైయస్సార్.

మరింత సమాచారం తెలుసుకోండి: