ఏంటి నిజామా? అని మీరు అనుకోరు. ఎందుకంటే వైయస్సార్ చంద్రబాబు స్నేహితులు అని మీకు తెలుసు కాబట్టి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్ప నాయకుడో తెలుగు ప్రజలను ఎవరిని అడిగిన తెలుస్తుంది. ఇంకా అలాంటి మహానేతకు చంద్రబాబు కూడా ఒక మంచి స్నేహితుడే. 

 

IHG

 

1975 నుండి 1983 వరకు వారు ఇద్దరు కలిసి పని చేశారు. ఇంకా అలాంటి మహానేతకు చంద్రబాబుకు రాజకీయంగా గొడవలు ఉన్నాయి తప్ప వ్యక్తిగత గొడవలు ఎప్పుడు లేవు. ఇంకా వారి స్నేహం గురించి వివరించలేము. ఇకపోతే ఇదే విషయాన్నీ ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత సంవత్సరం అసెంబ్లీలో చెప్పారు. 

 

IHG

 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ''రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. 1975 నుంచి 1983 వరకు మేమిద్దరం కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే గదిలో ఉండే వాళ్ళం. జగన్‌కు మా స్నేహం గురించి తెలియకపోవచ్చు. వైఎస్‌ఆర్‌తో రాజకీయ విభేదం తప్ప... వ్యక్తిగత వైరం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. 

 

IHG

 

ఇంకా ఆరోజు అందరూ చంద్రబాబును విమర్శించినప్పటికీ దివంగత నేత వైయస్సార్, చంద్రబాబు మంచి స్నేహితులు. ఇద్దరు యువ రాజకీయ నాయకులుగా ఉన్నప్పటి నుండి కలిసి అడుగులు వేశారు. అయితే అప్పుడే ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం.. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం వల్ల చంద్రబాబు ప్లేట్ మర్చి కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వెళ్లారు. కానీ వైయస్సార్ మొదటి నుండి ఓకే పార్టీలో ఉండి గెలుపు సాధించినవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: