లాభమో నష్టమో, మొత్తానికి అమరావతి విషయంలో బిజెపి ఓపెన్ అయిపోయినట్టు గా కనిపిస్తోంది. మొన్నటి వరకు బిజెపి అండదండలు తమకే ఉన్నాయని, జగన్ ప్రభుత్వం దూకుడుగా వెళితే, తాము బీజేపీతో కలిసి ఉద్యమిస్తామని జనసేన వంటి పార్టీలు ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగా బయపెట్టాయి. మొదటి నుంచి అమరావతి విషయంలో క్రెడిట్ కొట్టేద్దామనే అభిప్రాయంతో ఉన్న టిడిపి ఈ వ్యవహారంలో కొంతమంది అమరావతి ప్రాంత వాసులతో కలిసి ఉద్యమాన్ని నడిపిస్తూ, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తోంది. బిజెపి నాయకులు కూడా అమరావతిని రాజధాని కొనసాగించాలని, పరిపాలన రాజధాని పేరుతో వేరే ప్రాంతానికి తరలిస్తే ఊరుకోబోము అంటూ గట్టిగానే వార్నింగులు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చారు.

 

ఇక టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి వంటి వారు ఈ విషయంలో మొదటి నుంచి వైసీపీ పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అమరావతి ఎక్కడికి వెళ్ళదు అని, ఒక్క అంగుళం కూడా కదిలించలేరు అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ, ఇది బిజెపి జాతీయ పెద్దల అభిప్రాయంగా కూడా ఆయన చెబుతూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే మొదటి నుంచి కేంద్ర బీజేపీ పెద్దలు అమరావతి వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఇదే విషయాన్ని కొంతమంది బిజెపి దూతలతో చెప్పిస్తున్న, ఏపీ బీజేపీ నేతలు అమరావతి విషయంలో మద్దతుగా మాట్లాడుతుండటంతో, ఈ వ్యవహారంలో బిజెపికి ఏ క్లారిటీ లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

IHG'Amaravathi Is Gone Case'

 

ఇక బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా  ఇదే విషయాన్ని చెబుతున్నారు. రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, కేంద్రం జోక్యం చేసుకోదు అని చెబుతున్నారు. బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్'తో ఇదే విషయాన్ని గట్టిగానే కేంద్రం చెప్పేస్తోంది. ఇలా చేయడం ద్వారా సొంత పార్టీలోని సుజనా చౌదరి వంటి వారు అమరావతి విషయంలో ముందుకు వెళ్లకుండా కట్టడి చేసే విధానంలో భాగంగా బిజెపి ఈ ఎత్తుగడ వేసినట్టు గా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే రాజధాని వ్యవహారంలో బిజెపి తాము జోక్యం చేసుకోము అనే విషయాన్ని ఈ విధంగా క్లారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: