గాల్వాన్ వ్యాలీలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ వల్ల డ్రాగన్ కంట్రీ కుతంత్రం కళ్లకు కట్టినట్లుగా ప్రపంచానికి కనబడింది.. ఆయుధాలు లేని భారత సైనికులపై అతి దారుణంగా దాడి చేసి కిరాతకంగా ప్రాణాలు తీసినా చైనా సైనికుల చర్యలను ఖండించని వారు లేరు.. ఈ ఘటనతో భారత్‌కు ప్రపంచ దేశాల నుండి మద్దతు లభించగా, చైనా మాత్రం అది జీర్ణించుకోక మొన్నటి వరకు దూకుడుగా ప్రవర్తించింది.. అయితే భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్‌, చైనా విదేశాంగ శాఖమంత్రి వాంగ్ యీ‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాష‌ణ అనంత‌రం చైనా కాస్త వెనక్కు తగ్గడంతో, అమ్మయ్య చైనాతో భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయని అనుకుంటున్నారు..

 

 

కానీ చైనా విడుద‌ల‌ చేసిన ప్ర‌క‌ట‌న‌లో స్వ‌రం కాస్త భిన్నంగా క‌నిపిస్తుంది.. ఇదే కాకుండా చైనా చేసిన ప్ర‌క‌ట‌న‌లో నాలుగు ప్ర‌ధాన అంశాల‌పై అంగీకారం కుదిరిన‌ట్లు ప్ర‌స్తావించడమే కాదు, రెండు దేశాల మ‌ధ్య దౌత్య‌, సైనిక స్థాయి చ‌ర్చ‌లు కొన‌సాగుతాయ‌నీ వివ‌రించారు. అయితే ఎక్కడ కూడా చైనా ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌, ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు అనే ప‌దాలు క‌నిపించ‌లేదు. అదీగాక  చైనా విదేశాంగ శాఖ భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లోని ప‌శ్చిమ సెక్టార్‌లో గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ప‌రిణామాల్లో ఏది త‌ప్పో, ఏది ఒప్పో స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అంటే చెప్పకనే భారత్ తప్పుచేసిందని చెబుతున్నట్లుగా, తమ తప్పేమి లేదని సమర్ధించుకున్నట్లుగా ఈ ప్రకటన ఉందనే కోణంలో రెండు దేశాల సంబంధాల‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

 

మ‌రోవైపు చైనా ప్ర‌క‌ట‌న‌పై భార‌త్‌ ప్ర‌భుత్వాన్ని విప‌క్షాలు కూడా ప్ర‌శ్నిస్తున్నాయి. ఇక ఇదే అవకాశంగా మలచుకుని,ఈ అంశంపై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ మంగ‌ళ‌వారం కేంద్ర ప్ర‌భుత్వ‌మే ల‌క్ష్యంగా వ‌రుస ప్ర‌శ్న‌లు సంధించారు. మ‌రోవైపు భార‌త్‌-చైనా సంబంధాల నిపుణుడు బ్ర‌హ్మ చెల్లానీ కూడా ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తోనే ముందుకు వచ్చి, చైనా జారీచేసిన ప్ర‌క‌ట‌న‌లో వాస్త‌వాధీన రేఖ‌ను గౌర‌విస్తున్న‌ట్లు గానీ, య‌థాస్థితిని పాటిస్తామ‌ని గానీ లేదా ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేలా త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకుంటామనే విషయాల్లో సృష్టత ‌ఎందుకు లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు..

 

 

అయితే భారతీయుల అందరికి ఇక్కడ ఒక అనుమానం రావచ్చూ.. అదేమంటే సైనిక బలగాల ఉప‌సంహ‌ర‌ణ పేరుతో చైనా భారత్‌ను మోసం చేస్తుందా అని.. ఈ స్దితిలో గమనించ వలసిన విషయం ఏంటంటే జూన్ 15న గాల్వ‌న్ లోయ‌లో ప‌నిచేస్తున్న సైనికులంద‌రి ద‌గ్గ‌రా ఆయుధాలు ఉన్నాయి. అయితే 1996, 2005లో భార‌త్‌-చైనాల మ‌ధ్య కుదిరిన ఒప్పందం వ‌ల్ల వారు ఎలాంటి కాల్పులూ జ‌ర‌ప‌లేదు, ఇదే అదనుగా చైనా సైనికులు గుండాల్లా మారణాయుధాలతో మన సైనికుల పై విరుచుకుపడ్డారు.. అంటే నిబంధనలు ఎవరు ఉల్లంఘించినట్లో సృష్టంగా అర్ధం అవుతుంది..

 

 

ఇక ఈ డ్రాగన్ చేప్పేది ఒకటి చేసేది ఒకటనే విషయంలో ఈ ఘటన ఉదాహరణగా తీసుకోవచ్చు.. చైనా ప్రపంచం కనుగప్పడానికి ఎన్ని ఎత్తులు అయినా వేయచ్చు.. అలాగే మనలను నమ్మించడానికి, త‌మ సార్వ‌భౌమ‌త్వాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డంతో పాటు శాంతి స్థాప‌న‌కూ ప్రా‌ధాన్యం ఇస్తున్నట్లు నటిస్తుంది కావచ్చూ.. అందుకే ఈ దేశాన్ని పూర్తిగా నమ్మడానికి వీలులేదని గత చరిత్ర చెబుతుంది.. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: