దాదాపు యాభై సంవత్సరాల క్రితం డాక్టర్ చదువు పూర్తి చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ పట్టాను కూడా పొందారు. ఆ తర్వాత తాను జన్మించిన జమ్మలమడుగు లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1973వ సంవత్సరంలో పులివెందులలో వైయస్ రాజారెడ్డి పేరిట ఒక 70 పడకల ఆసుపత్రి ని వైయస్ఆర్ కుటుంబం నిర్మించారు. అయితే ఆ ఆసుపత్రి లో వైయస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ గా కొంత కాలం పనిచేశారు. విశేషం ఏమిటంటే ఆ ఆస్పటల్ ఇప్పటికీ 24 గంటలు పనిచేస్తూ పేద ప్రజలకు వైద్యం అందిస్తూనే ఉంది. ఈ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేసినంత కాలం వైయస్ రాజశేఖర్ రెడ్డి రోగులకు చికిత్స చేసి ఫీజుగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకునేవారు. అందుకే రాజశేఖర్ రెడ్డి ని రూపాయి డాక్టర్ అని ప్రజలు గొప్పగా పిలిచేవారు.


అతని దగ్గర వైద్యం చేయించుకున్నవారు అదృష్టవంతులని అప్పట్లో ప్రజలు తెగ చెప్పుకునేవారు. మూడు పదుల వయసు రాకముందే వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచారు. పేద వారిని ఆదుకోవాలని తనలోని ఉండే తపన మెచ్చుకోదగ్గ గొప్ప విషయం. 1978 వ సంవత్సరం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని చేజిక్కించుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమ వ్యధ ని చూసి తాను కేవలం రూపాయి మాత్రమే వేతనంగా తీసుకుంటానని మిగతా డబ్బులన్ని ప్రజల సంక్షేమం కొరకు వాడాలని సిఎంను కోరి తన గొప్ప హృదయాన్ని మళ్ళీ చాటుకున్నారు.


ఇకపోతే వైఎస్ఆర్ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను, డిగ్రీ కళాశాలను కూడా నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రెండు కాలేజీలను లయోలా కాలేజీ సంస్థకు అప్పగించేశారు. కానీ పులివెందల కి కాస్త దూరంలో ఉన్న సింహాద్రిపురం లోని కాలేజీని ఇప్పటికీ వైయస్సార్ కుటుంబం నిర్వహిస్తోంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: