దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపిన ముసలి వాళ్ళదాక ఎదో ఒక్క ప్రాంతంలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కామాంధుల వికృత చేష్టలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. సమాజంలో ఆడపిల్ల అంటే మరి చిన్నచూపు అయ్యింది. మహిళ ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న ఆడదే కదా అనే చులకన భావన ఎక్కువగా ఉండిపోయింది. సమాజంలో ఉండే ప్రతి ఆడపిల్ల ఎదో ఒక్క ప్రాంతంలో వేధింపులకు గురవుతున్నారు. అయితే తాజాగా అలాంటి ఘటనే  నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

 

 

 

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ గ్రామ వాలంటీర్ విచ్చల విడిగా రెచ్చిపోయాడు. అతను మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న మహిళా ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఈ ఘటనలో అతడితో పాటూ స్నేహితుడిపై కేసు నమోదు చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట మసయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాలంటీరు, మరో మహిళా వాలంటీరు భర్త మద్యం తాగి వెళుతున్నారు. అదే సమయంలో ఎస్సై రోజాలత వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

 

 

 

అయితే వాలంటీర్ వాహనాన్ని ఎస్సై ఆపారు. ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. ఎస్సై పక్కన ఉన్న కానిస్టేబులుకు, వాలంటీరుకు మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే వాలంటీరు రెచ్చిపోయాడు. దింతో ఎస్సై పైకి దూసుకొచ్చాడు. అతడు అసభ్య పదజాలంతో దూషిస్తూ.. చొక్కా విప్పి నానా హంగామా చేశాడు. ఈ సీన్ మొత్తాన్ని మొబైల్‌లో కూడా రికార్డు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఐ నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే ఆ మరసటి రోజే ఆ సీఐని బదిలీపై పంపించడం ఆసక్తికరంగా మారిందని నెటిజన్లు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: