వైఎస్ అనగానే కాంగ్రెస్ కాంగ్రెస్ అనగానే వైఎస్. ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సిఎం జగన్...  వైసీపీ స్థాపించినా సరే చాలా మంది వైఎస్ అనగానే కాంగ్రెస్ అనే అనుకుంటారు ఇప్పటికి కూడా. ఆయన ఆ విధంగా ముద్ర వేసుకున్నారు అనేది వాస్తవం. ఆయన రాజకీయం చేసింది ఆ పార్టీ లో సిఎం అయింది ఆ పార్టీ లో ఆయన చనిపోయింది కూడా అదే పార్టీ లో. ఆయన ఎన్నాళ్ళు రాజకీయం చేసినా సరే అధిష్టానం ఇబ్బంది పడే విధంగా ఏ నాడు కూడా చేయలేదు. కాంగ్రెస్ అధినేత్రి గా సోనియా ఉన్నా సీతారాం కేసరి ఉన్నా సరే... 

 

వాళ్లకు ఆయన బద్దుడి గానే ఉన్నారు గాని ఎక్కడా కూడా వారికి ఎదురు చెప్పిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. సోనియా ను ఆయన ఎక్కడా కూడా ఎదిరించలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. సోనియా గాంధీ కూడా ఆయనకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అని చాలా మంది ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. వైఎస్ లో ఉన్న రాజనీతి రాజకీయ౦ అన్నీ కూడా ఆమెకు చాలా బాగా నచ్చాయి అని అందుకే ఆమె ఆయనకు బాగా వాల్యూ ఇచ్చారు అని అంటారు. ఇక దే విధంగా రాహుల్ గాంధి కూడా  వైఎస్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 

 

వైఎస్ ని ఆయన ఎప్పుడు ఆదరించారు. దానికి కరణం వైఎస్ పార్టీ కోసం కష్టపడిన విధానం ఏపీ లో ఆయన పార్టీ కోసం వేసిన బీజాలే. ఆ విధంగా  వైఎస్ తన మార్క్   పాలన తన మార్క్ రాజకీయం చేసి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు అనే చెప్పాలి. ఇప్పటికీ కాంగ్రెస్ లో ఆయన పేరు వాడుకునే వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: