కరోనా కష్టకాలంలో మీరు ప్రయాణం చేయడానికి ఆలోచిస్తున్నారా...? ఈ కష్టకాలంలో సొంత వాహనం కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా కస్టమర్లకు తీపికబురు చెప్పింది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారికి పలు రకాల బెనిఫిట్స్‌ను అందిస్తోందన్నారు. తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం, అతితక్కువ నెలవారీ ఈఎంఐ, లోన్ మారటోరియం వంటి పలు ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు. వీటి కోసం మారుతీ సుజుకీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టిందని సమాచారం.

 

 

యాక్సిస్ బ్యాంక్ మారుతీ సుజుకీ కారు కొనుగోలు చేసే వారికి పలు రకాల లోన్ ఆప్షన్స్ అందిస్తోందన్నారు. వేతన జీవులు కారు ధరకు సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చునని తెలిపారు. తీసుకున్న రుణాన్ని 8 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయని తెలిపారు.

 

 

అయితే కారు కొనుగోలుదారులు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.లక్షకు రూ.1250 నుంచి ఈఎంఐ ప్రారంభమౌతుందని తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ తీసుకునే వారికి మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉందన్నారు. తొలి మూడు ఈఎంఐలకు నెలకు రూ.899 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఇంకా పలు రకాల ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయని యాజమాన్యం తెలిపారు.

 

 

అయితే మారుతీ సుజుకీ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలిపారు. కేవలం ఉద్యోగం చేసేవారు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా కారు కొనేందుకు సులభంగానే రుణం పొందొచ్చునన్నారు.

 

 

అయితే ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా కూడా రుణం పొందొచ్చని యాక్సస్ బ్యాంక్ తెలియజేశారు. మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. కోవిడ్ 19 కారణంగా ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని తెలిపారు. ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వెహికల్ గురించి ఆలోచిస్తున్నారని ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: