ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపట్టిన రాజశేఖర్‌ రెడ్డి, తనను నమ్ముకున్న వారికోసం ఏదైనా చేసేవారు.రాజకీయాల్లోకి రావడానికి రాజశేఖర్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో వచ్చిన తర్వాత ప్రజల మన్ననలు పొందడానికి అంతే కష్టపడ్డాడు.  కాలికి చక్రాలను కట్టుకున్నట్టు ఊరూరా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నాడు. సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. 

 


అహర్నిశలు నా ప్రజలు అంటూ ప్రజల మధ్యలో తిరిగిన మహానేత వైఎస్.. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ప్రియతమా నాయకుడుగా మెలిగాడు. ప్రజల గుండె చప్పుడును విన్న ఆయన ప్రజల శ్రేయస్సు కోసం పాకులాడాడు. దేశానికి వెన్నెముక అంటే రైతు..  రైతుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేసాడు. వారి కళ్ళల్లో సంతోషాన్ని నింపడానికి నిత్యం శ్రమించాడు. రైతు బందులాగా కష్టాలను కడతేర్చాడు. కరువును కప్పుకున్న రాయల సీమను రత్నాల సీమ గా మార్చి మకుటం లేని మహారాజుగా తెలుగు ప్రజల గుండెల్లో మెలిగాడు.

 

 


వైఎస్సార్ రాజకీయాల్లోకి వచ్చాక అలుపెరగని బాటసారిగా ఊరూరా తిరిగి అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళరా , అన్నల్లారా అంటూ ఆప్యాయతలను పంచుకోవడంతో పాటుగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసాడు. ముఖ్యంగా రైతుల అభివృధ్ధికోసం రుణాలను ఇచ్చాడు. అంతేకాకుండా విత్తనాలను అందించాడు. గతంలో తీసుకున్న రుణాలను మాపీ చేసాడు. రైతన్న రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చి దిద్దాడు. అందుకే రైతుల బంధు ప్రీతీ వైఎస్సార్ అని అందరు కొనియాడుతున్నారు. మంచివాళ్లను దేవుడు ఎక్కువ కాలం భూమీద ఉంచాడు కదా అలానే వైఎస్సార్ ను కూడా తన దగ్గరకు తీసుకెళ్లిపోయాడు. ఆయన గుండె చప్పుడు ఆగిన సంగతి తెలుసుకున్న వందలాది రైతుల గుండె ఆగిపోయింది.నేడు ఆ మహనీయుడు జయంతి.. ఏ లోకాన ఉన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. 

మరింత సమాచారం తెలుసుకోండి: