తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మహానేత దివంగత నేత  స్వర్గీయ నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపట్టిన వైస్సార్, తనను నమ్ముకున్న వారికోసం ఏదైనా చేసేవారు.రాజకీయాల్లోకి రావడానికి రాజశేఖర్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో వచ్చిన తర్వాత ప్రజల మన్ననలు పొందడానికి అంతే కష్టపడ్డాడు. కాలికి చక్రాలను కట్టుకున్నట్టు ఊరూరా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నాడు. సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. 

 

 

మనకు సీఎంగా ఒక లీడర్ గా కనిపించింది 2004లో. కానీ వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు ఎంత కష్టపడ్డారో మాటలలో చెప్పలేము. 1978లో ప్రజలకు మంచి చెయ్యాలని ఉద్దేశ్యంతో రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఇక అప్పటి నుండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. అందుకే అందరి గుండెల్లో  చెరగని ముద్ర వేసుకున్నాడు. 

 

 

ముఖ్యమంత్రి అవ్వడానికి 25 ఏళ్ళు పట్టింది. ఎంతో సేవ, ఎన్నో హామీలు సంక్షేమం ముందుగా అడుగులు వేశారు. ఇంకా ఇప్పుడు మనం సీఎం జగన్ పాదయాత్రని చూశాం. కానీ 2003లో మండు వేసవిలో వైయ‌స్ 1467 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలైంది. వైయ‌స్ పాదయాత్రలో ఎంతోమంది కష్టాలను చూసి చెలించిపోయి ప్రతిఒక్కరికి న్యాయం జరిగేలా అయన చేశాడు. సంక్షేమం అంటే వైయస్సార్.. వైయస్సార్ అంటే సంక్షేమం అనేంతలా అయన అభివృద్ధి చేశాడు. మంచివాళ్లను దేవుడు ఎక్కువ కాలం భూమీద ఉంచాడు కదా అలానే వైఎస్సార్ ను కూడా తన దగ్గరకు తీసుకెళ్లిపోయాడు. ఆయన గుండె చప్పుడు ఆగిన సంగతి తెలుసుకున్న వందలాది రైతుల గుండె ఆగిపోయింది. నేడు ఆ మహనీయుడు జయంతి.. ఏ లోకాన ఉన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. 

మరింత సమాచారం తెలుసుకోండి: