తెలుగు ప్రజల ప్రియతమ నాయకుడు స్వర్గీయ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన స్వర్గస్తుడై  దశాబ్దం గడిచిపోయినా ఇంకా ఆయన స్మతుల్లో వారు తాద్యాత్మం చెందుతారు. వైఎస్ గురించిన విశేషాలు ఏవైనా వారికి ఆసక్తి దాయకమే. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఇప్పటికే ఎందరో పుస్తకాలు రాశారు. అయితే ఇప్పుడు సాక్షాత్తూ ఆయన సతీమణి విజయమ్మ స్వయంగా రాసిన ‘‘నాలో... నాతో... వైయ‌స్సార్‌ ’’ పుస్తకం ఇప్పుడు వైఎస్ జయంతి వేళ.. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్ చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోంది.  


    

వైయ‌స్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకంలో విజయమ్మ ఆవిష్కరించారు. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో... ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ ఈ పుస్తకంలో వివరించారు.   
 


కుటుంబాన్ని ఎంత అభిమానించాడో రాష్ట్ర ప్రజలను కూడా అంతకు మించి ప్రేమించాడు. అయన పిలిచే అభిమానమైన మాటకు ఎందరో ఆయనకు అభిమానులుగా మారారు. మరెందరో అయన అడుగు జాడల్లో నడిచారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన ఊపిరిగా భావించిన ఆయన వారి కళ్ళల్లో సంతోషాలను నింపడానికి రేయింబవళ్లు శ్రమించాడు. ముఖ్యంగా రైతులకు, మహిళలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. డ్వాక్రా పథకాన్ని అమలు చేసి జీరో వడ్డీతో రుణాలను ఇచ్చి వారి స్వయం ఉపాధికి పాటు పాడిన మహనీయుడు. అందుకే అందరు వైఎస్సార్ ను అన్నగా, చేయూతనందించిన దాతగా పిలుస్తారు.

 

 

వైయ‌స్ పాదయాత్రలో ఎంతోమంది కష్టాలను చూసి చెలించిపోయి ప్రతిఒక్కరికి న్యాయం జరిగేలా అయన చేశాడు. సంక్షేమం అంటే వైయస్సార్.. వైయస్సార్ అంటే సంక్షేమం అనేంతలా అయన అభివృద్ధి చేశాడు. మంచివాళ్లను దేవుడు ఎక్కువ కాలం భూమీద ఉంచాడు కదా అలానే వైఎస్సార్ ను కూడా తన దగ్గరకు తీసుకెళ్లిపోయాడు. ఆయన గుండె చప్పుడు ఆగిన సంగతి తెలుసుకున్న వందలాది రైతుల గుండె ఆగిపోయింది. నేడు ఆ మహనీయుడు జయంతి.. ఏ లోకాన ఉన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. 

మరింత సమాచారం తెలుసుకోండి: