ఎలా వచ్చింది కాదు అన్నయ్య.. క్రెడిట్ వచ్చిందా లేదా అన్నట్టుగా జనసైనికుల వ్యవహారం సాగుతూ వస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, పవన్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను తమ భుజాలపై వేసుకుని, పార్టీని జనాలు మర్చిపోకుండా కాపాడుకుంటూ వస్తున్న జనసైనికులు, ఎక్కడా పవన్ పై ఈగ వాలకుండా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే పార్టీలో లోపాలపై ఎవరు వేలెత్తి చూపించినా, సోషల్ మీడియా వేదికగా వారిపై విమర్శలు చేస్తూ నిజమైన భక్తులు గా వారు, తమను తాము నిరూపించుకుంటూ వస్తున్నారు. నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నా, నిజంగా జనసేనను, పవన్ ను కాపాడుకుంటూ వచ్చేంది మాత్రం జనసైనికులే. ఇదిలా ఉంటే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ విమర్శలు చేస్తూనే ఉంటారు.

 

IHG

 

అలాగే కొన్ని కొన్ని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందామనే ఆలోచనల్లో ఉండగానే, దానిపై పవన్ స్పందిస్తూ ఆ అంశంపై డిమాండ్ చేస్తూ ఉంటారు. ఆ తరువాత ప్రభుత్వం దానికి సంబంధించిన అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, అదంతా తమ క్రెడిట్ అన్నట్టుగా జనసేన పార్టీ చెప్పుకోవడం, ఆనవాయితీగా వస్తోంది . ఇక లా నేస్తం పేరుతో జగన్ లాయర్లకు ప్రతినెల ఐదు వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కొద్ది నెలలు ఆ సహాయం అందించినా, కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది వాయిదా పడింది. దీనిపై స్పందించి వెంటనే ఆ నిధులు విడుదల చేయాల్సిందిగా పవన్ డిమాండ్ చేశారు. ప్రతినెల న్యాయవాదులకు పదివేలు చొప్పున ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... మార్చి నుంచి జూన్ వరకు పెండింగ్ లో ఉన్న నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

 

ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెల ఐదు వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని, ప్రాక్టీస్ సమయంలో మూడేళ్లపాటు అందించే విధంగా ఈ పథకాన్ని గత ఏడాది డిసెంబర్ మూడో తేదీన జగన్ ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన పవన్ దీనిపై స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ లేఖ రాసిన రెండు రోజుల కే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇదంతా పవన్ గొప్పతనమే అని, పవన్ స్పందించకపోతే ఆ నిధులు విడుదల చేసి ఉండేవారు కాదు అని,  జనసైనికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తూ, సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగ్స్ పెడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: