చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడడానికి లోన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ నిజంగా  శుభవార్త. ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుంటే నిజంగా ఇది మంచి ప్రయోజనం. ఈ రెండు బ్యాంకుల్లో కూడా తాజాగా రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది. ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు నుంచి కూడా బయట పడాలని అనుకుంటున్నారు.

 

అందుకని లోన్ తీసుకోవాలి అని అనుకుంటే నిజంగా ఈ అవకాశాన్ని మీరే వినియోగించుకోండి. బ్యాంకులు ఇప్పుడు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి అయితే ఈ రెండు బ్యాంకులు కూడా ఎంసిఎల్ఆర్ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వచ్చాయి. దీనితో  కస్టమర్లకి చక్కటి ప్రయోజనం లభిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీనితో లోన్ తీసుకునే వాళ్లకి బాగా ప్రయోజనం ఉంటుంది. ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. అలానే కొత్తగా లోన్ తీసుకోవాలని భావించి వారికి కూడా ఇది లాభదాయకం. కెనరా బ్యాంక్ ఎం సి ఎల్ ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

 

దీనితో బ్యాంక్ ఏడాది ఎం సి ఎల్ ఆర్ 2.65 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిపోయింది. ఓవర్నైట్ నెలవారి ఎం సి ఎల్ ఆర్ విషయానికొస్తే 7.2 శాతానికి తగ్గింది మూడు నెలలు ఎం సి ఎల్ ఆర్  7.45 శాతం తగ్గింది.  అదే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే ఎం సి ఎల్ ఆర్ రేటు 7.75 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది ఇదిలా ఉంటే ఎస్బీఐ కూడా తాజాగా మూడు నెలల వరకు రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: