ఏ దేశంలోనైనా ప్రజలు తమ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా ఆ దేశానికి మద్దతు తెలుపుతూ ఉంటారు. భారత్ లో మాత్రం మెజారిటీ శాతం ప్రజలు దేశభక్తిని కలిగి ఉన్నా దేశంపై విమర్శలు చేసేవాళ్లు కూడా ఉన్నారు. గత నెల 15వ తేదీన చైనా భారత్ దేశాల సైనికుల మధ్య గాల్వన్ లోయ దగ్గర ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో మన దేశానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. 
 
చైనా మాత్రం అధికారికంగా ఇప్పటివరకు ఎంతమంది సైనికులు చనిపోయారనే వివరాలను మాత్రం ప్రకటించడం లేదు. చైనా తీరుపై ఆ దేశం ప్రజలే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అధికారికంగా చనిపోయిన జవాన్ల లెక్కలు ప్రకటించాలని కోరుతున్నారు. అయితే చైనా దాచినా తాజాగా చనిపోయిన సైనికులకు సంబంధించిన లెక్కలు, ఇతర లెక్కలు కూడా బయటపడుతున్నాయి. 
 
భారత్ సైనికులు ఏ స్థాయిలో చైనా సైనికులపై దాడి చేశారనే ప్రశ్నకు ఈ లెక్కలే సమాధానంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 148 మంది చైనా సైనికులు మరణించారనే సంగతి బయటికొచ్చింది. మిగిలిన సైనికులలో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయని వాళ్లు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. భారత సైనికులు వీళ్ల మెడలను విరిచేయడంతో వీళ్ల పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని సమాచారం అందుతోంది. 
 
తీవ్ర గాయాలపాలైన సైనికులలో 10 శాతం మంది కోమాలో ఉన్నారని తెలుస్తోంది. మరికొంతమంది సైనికులకు వెన్నముక దెబ్బతిందని.... మిగతా సైనికులలో చాలామంది వేర్వేరు సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. మిలిటరీ సిబ్బంది కుటుంబాలు ఆందోళనలు చేస్తూ ఉండటంతో అనధికారికంగా ఈ లెక్కలు బయటకొఛ్చాయి. అయితే చైనా మాత్రం అధికారికంగా చనిపోయిన జవాన్ల గురించి, గాయాలపాలైన సిబ్బంది గురించి లెక్కలు చెప్పే సాహసం చేయదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: