ప్రస్తుతం దేశం మొత్తం కరోనా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రా సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉంటున్నారు. ఒకవేళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పూర్తిగా పరీక్షలు నిర్వహించి తర్వాత హూం క్వారంటైన్ కి తరలిస్తున్నారు. తాజాగా అంత రాష్ట్ర సరిహద్దు పొందుగల పోలీస్ చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన రూరల్ ఎస్ పి విశాల్ గున్ని.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రా లన నుంచి వచ్చేవారు ఈ పాస్ తప్పని సరి ఉండాలిని అన్నారు. పాస్ లేకుండా అనుమతి లేదని అన్నారు.

 

తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ ల నుండి వచ్చే వారికి స్వాప్ టెస్ట్ తప్పకుండా తీసుకోవాలని.. కోవిడి  కమాండ్ సెంటర్ వద్ద తప్పనిసరి అన్నారు. ఇక  ప్రతి రోజు ఈ పాస్ తో మూడు వందల నుండి నాలుగు వందల వాహనాలు సరిహద్దు దాటుతున్నాయి. అక్రమ మద్యం, నాటు సారా, అక్రమ ఇసుక రవాణా  కు ఈ చెక్ పోస్ట్ చాలా కీలకమైనది సరిహద్దు వద్ద పోలీసులు చాలా భద్రతతో వ్యవహరిస్తున్నారని న్నారు.  ఇక్కడి పోలీస్లీ పనితీరు బాగుంది.. వారికి  నా అభినందనలు అన్నారు.

 

ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారు పోలీసులకి సహకరించాలి. స్పందన పాస్ ఉంటే వెంటనే పంపిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలు వరకు మాత్రమే సరిహద్దులో కి అనుమతి సాయంత్రం ఏడు తరువాత ఏదైన మెడికల్ ఎమర్జెన్సీ కి మాత్రమే అనుమతి అక్రమ మద్యం పై చెక్ పోస్ట్ వద్ద నిఘా వుంది. ఇల్లీగల్  యాక్టివిటీస్ ఏమైన వుంటే ఎవరైనా నా వాట్సప్ కు పంపండి

మరింత సమాచారం తెలుసుకోండి: