ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజల సంక్షేమానికి జగన్ పెద్దపీట వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో సైతం పథకాలను అమలు చేసి జగన్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. రైతులు, పేదలకు ప్రయోజనం కలిగేలా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 
 
మరోవైపు 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురే లేకుండా పోయింది. ఏ ఎన్నికలు జరిగినా అక్కడ టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధించింది. బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ సాగిస్తున్న పాలన ప్రజలను ఆకట్టుకుంటోంది. రైతుబంధులాంటి పథకాలను కేసీఆర్ ను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. కరోనా విజృంభణ సమయంలోను కేసీఆర్ ప్రజలకు నగదు పంపిణీ చేసి వారికి ప్రయోజనం చేకూరేలా చేశారు. 
 
అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలను పొందడంలో విఫలమవుతున్నారనే కామెంట్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కేంద్రం భారతదేశంలోనే అతి పెద్దదైన 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లో పెడుతోంది. కేంద్రం మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే సోలార్ పవర్ ప్లాంట్ పెడుతుంటే ఏపీ, తెలంగాణలో ఎన్ని ప్లాంట్లు పెట్టాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జగన్, కేసీఆర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరహా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 
రాయలసీమ. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెడితే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. వర్షాలు తక్కువగా కురిసే ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ దిశగా చర్యలు చేపడుతారో లేదో చూడాల్సి ఉంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: