వైసీపీ దేశంలో కీలక‌మైన పార్టీ. లోక్ సభలో నాలుగవ అతి పెద్ద పార్టీ. ఇక రాజ్యసభలో ఆరవ పార్టీ. మొత్తంగా చూసుకుంటే 28 మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారు. జగన్ 151 సీట్లతో బలమైన ప్రభుత్వాన్ని ఏపీలో నడుపుతున్నారు. ఇక జగన్ కి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ సైతం జగన్ని సమాదరిస్తున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉండగానే ఈ బంధం మరింత గట్టిచేసుకోవాలని బీజేపీ ఆలోచన చేస్తోందిట. త్వరలో కేంద్ర మంత్రివర్గం విస్తరించాలని మోడీ ఆలోచన చేస్తున్నారని టాక్. ఈ మధ్యనే ఆయన రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ ని కలిశారు. ఆ భేటీలో అన్ని అంశాలతో పాటు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా చర్చగా వచ్చిదట. 

 

మరో వైపు చూసుకుంటే కేంద్ర మంత్రులలో కొందరు సరిగ్గా పనిచేయలేదని అంటున్నారు. వారిని ఇంటికి పంపించి సమర్ధులకు  అవకాశం ఇవ్వాలని కూడా మోడీ భావిస్తున్నారుట. అదే విధంగా దేశంలో ఇంకా చోటు ఇవ్వని రాష్ట్రాలకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారుట. ఆ విధంగా ఆలోచిస్తే ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు లేదు.

 

గతంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కేంద్రంతో నాలుగేళ్ల పాటు దోస్తీ చేసి తన మంత్రులను ఇద్దరిని అక్కడ ఉంచింది. 2018 మార్చి తరువాత టీడీపీ కేంద్రానికి డుమ్మా కొట్టిన తరువాత కేంద్రంలో ఏపీ నుంచి మంత్రి లేరు. బీజేపీకి ఏపీ నుంచి లోక్ సభ సభ్యులు లేరు. రాజ్యసభ సభ్యులు ఉన్నా వారు టీడీపీ నుంచి ఫిరాయించిన వారు కావడం విశేషం.

 

దాంతో వారిని తీసుకుంటే మొదటి నుంచి ఉన్న వారికి ఇబ్బంది. దాంతో వైసీపీతో మిత్రుత్వాన్ని మరింత గట్టి పరచుకుకునే వ్యూహంలో భాగంగా ఆ పార్టీని కేంద్రంలో చేరాలని మోడీ సర్కార్ ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండు నుంచి మూడు మంత్రి పదవులు వైసీపీకి ఉన్న బలానికి ఇస్తారని అంటున్నారు మరి జగన్ ఈ ప్రతిపాదనను ఓకే అంటారా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: