కేసీఆర్ ఎక్కడ.. ఇప్పుడు తెలంగాణలో ఇది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ప్రగతి భవన్‌లో 30 వరకూ కరోనా కేసులు వచ్చాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆయన అధికారిక కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. ఇదే సమయంలో తెలంగాణలోని విపక్షం కాంగ్రెస్ ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తోంది. 


తెలంగాణలో దుర్భర పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలని ఉత్తం కుమార్ రెడ్డి  సూచించారు. పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరామని, 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని ఉత్తం కుమార్ రెడ్డి చెబుతున్నారు. 

 

IHG


సీఎం కేసీఆర్ తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారని, మొదటి నుంచి కరోనా విషయంలో తప్పుడు విధానాలనే ఆయన అవలంభిస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం మొండివైఖరి కారణంగానే రాష్ట్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. 

 


మరో కాంగ్రెస్ నేత jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై మండిపడ్డారు. కొత్త సచివాలయం కోసం పాత సచివాలయాన్ని హడావుడిగా కూల్చివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.  వాస్తు నమ్మకాల పిచ్చి కోసం విలువైన సచివాలయ భవనాలను కేసీఆర్ కూల్చుతున్నారని jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి విమర్శించారు. హైకోర్టు లో తీర్పు వచ్చిన వెంటనే ఈ భవనాలను కూల్చడం ఆరంభించారని, సుప్రింకోర్టులో విచారణకు రానున్న సందర్భంలోనే ఇంత హడావుడిగా కూల్చారని మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: