దేశంలో చాప కింద నీరులా శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరినుండి వైరస్ సోకుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గత కొన్ని రోజులుగా పల్లెల్లో సైతం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే వైరస్ నుంచి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గాలి ద్వారా కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం జరుగుతోంది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గాలి ద్వారా కరోనా సోకుతుందనే వార్తలను కొట్టిపారేయలేమని చెబుతోంది. మరి నిజంగా గాలి ద్వారా కరోనా సోకితే మాత్రం భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటివరకు బయటకు వెళితే మాత్రమే మాస్కులు ధరిస్తున్నాం. గాలి ద్వారా వైరస్ నిర్ధారణ అయితే ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తుంది. శాస్త్రవేత్తల ప్రయోగాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
అయితే వెలుగులోకి వస్తున్నా ఈ విషయాలు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయే తప్ప సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడటం లేదు. ఇదే సమయంలో వైరస్ కు సంబంధించిన కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 దేశాల శాస్త్రవేత్తల బృందం కరోనా ప్రస్తుతం గుండెపై ప్రభావం చూపుతోందని.... ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర జీవించగలుగుతోందని చెబుతున్నారు. 
 
ఇప్పటికే చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు. దీంతో రోడ్డుపైకి అడుగు పెట్టాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారికంగా గాలి ద్వారా వైరస్ సోకుతుందని తెలియాల్సి ఉంది. వైరస్ ఇదే విధంగా వ్యాప్తి చెందితే మాత్రం భవిష్యత్తులో భారతదేశంలో రోజుకు 2 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గాలి ద్వారా కరోనా సోకితే మాత్రం మున్ముందు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని... వైరస్ వ్యాప్తిని ఆపలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: