మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. చదువుకున్న వ్యక్తి అనేక ఆశలు భవిష్యత్తుపై పెట్టుకుంటే మహమ్మారి వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచంలో పరిస్థితులు మారటంతో పాటు, చేస్తున్న ఉద్యోగాలు కోల్పోవడంతో చాలామంది నిరుత్సాహం చెందుతున్నారు. అసలు చదువు దేనికి అనవసరం కదా అని అందరూ భావించే పరిస్థితి ప్రపంచంలో ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమా ధియేటర్ లు క్లోజ్ అవ్వడంతో ఇండస్ట్రీ పై ఆధారపడిన చాలామంది అభద్రతా భావం తో ఉన్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిర్మాతలు తెగ ఆందోళన చెందుతున్నారు.

IHG

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దెబ్బకి రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఈ మహమ్మారి రాకముందు ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి గట్టిగా ఉంది. అధికార పార్టీ వైసీపీ ఎలాగైనా లోకల్ ఎలక్షన్స్ అన్ని స్థానాల్లో గెలిచి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా భవిష్యత్తు లేకుండా చేయాలని వ్యూహాలు మీద వ్యూహాలు వేయటం అందరికీ తెలిసిందే. చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికల టైంలో నోటిఫికేషన్ జారీ చేసే టైంలోనే ఏకగ్రీవాలు అయ్యేలా అధికారపార్టీ నేతలు వ్యవహరించారు.

IHG

అయితే ఆ తర్వాత కరోనా రాకతో ఎలక్షన్స్ మొత్తం రద్దు అవటంతో సార్వత్రిక ఎన్నికల టైంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టిన రాజకీయ నేతలు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అంటుండగా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరోపక్క అధికార పార్టీలో పదవుల విషయంలో ఆశలు పెట్టుకున్న నేతల ఒత్తిళ్లు పై స్థాయి నేతలకు తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: