పిస్తోంది. కొత్తగా 1,879 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 1,422 మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందినవాళ్లే. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 27,612 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది.  తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి  అన్నారు.  ఇవాళ కిషన్ రెడ్డి కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ని కలిశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ఆయనతో చర్చించారు. 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. గత రెండు నెలల కన్నా ఒక్క నెలలోనే కరోనా కేసులు వేల సంఖ్యకు చేరడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. హైదరాబాద్ ప్రజల ఆందోళనను కేంద్ర ఆరోగ్యమంత్రికి వివరించానని వెల్లడించారు. తెలంగాణకు అన్నివిధాలా సాయం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అవసరమైన వైద్య బృందాలను పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.  

 

రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరతపై కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, 1220 వెంటిలేటర్లు ఇస్తున్నట్టు చెప్పారని తెలిపారు. కరోనా కట్టడికి కేంద్రం తెలంగాణకు రూ.215 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే 2.41 లక్షల పీపీఈ కిట్లను, 7.14 లక్షల ఎన్-95 మాస్కులను తెలంగాణకు పంపిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్టులు చేయాలని అన్నారు. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని ఆయన  పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: