దేశాన్ని ఒక వైపు కరోనా వైరస్ అతలాకుతలం చేస్తూంటే మరోవైపు మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట మాత్రం పాడడం లేదు. తాజాగా ముంబై మహానగరంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్ లో పరిచయమైన ఒక వ్యక్తి 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  

 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. జూలై 1వ తేదీ నుంచి బాలిక ఇంట్లో కనపడట లేకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీస్ అధికారులను సంప్రదించారు. దీనితో పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక పోలీసుల దర్యాప్తులో ఫేస్ బుక్ లోఒక ఫ్రెండ్ తో బాలిక టచ్ లో ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. దీనితో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని జాడ కనిపెట్టి పోలీసు అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.  ఇక పోలీసు బృందం రాజస్థాన్ లోని మరో టీం ను మధ్యప్రదేశ్ లో  రాజస్థాన్ లో  దాడులకు పాల్పడిన వారిని పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. దీనితో ఆ బాలికను వారి చెర నుంచి విడిపించి వారి తల్లిదండ్రులకు అందజేశారు. 

 


నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక పోలీస్ అధికారులు వారి రీతిలో విచారణ చేపట్టగా తన నలుగురు స్నేహితుల సహాయంతో ఆ బాలికను కిడ్నాప్ చేసి రాజస్థాన్ కు తీసుకుని వెళ్లి రేప్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. లాక్ డౌన్  సమయంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే కచ్చితంగా పర్మిషన్  ఉండాలి. లేకపోతే కనీసం పాస్ అయిన తీసుకోవాలి. కానీ. అవేవీ లేకుండా నిందితుడు ఒక బాలికను కిడ్నాప్ చేసి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకువెళ్ళాడు. ఇందులోని ప్రధాన నిందితుడు అతనికి సహకరించిన నలుగురి వ్యక్తులపై పోలీసులు అధికారులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: