తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి నాడు రాష్ట్రవ్యాప్తంగా  పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అనేక ప్లాన్ లు వేశారు. కానీ చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే ఆగస్టు 15వ తారీకు స్వాతంత్ర దినోత్సవము నాడు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా గతంలో ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కానీ ఇల్లు గాని కేటాయిస్తే వాటిని అమ్ముకోవడానికి వీలుండేది కాదు. కానీ ఈసారి పెద్ద ఎత్తున అసైన్డ్ భూములను వైసీపీ ప్రభుత్వం సమీకరించి ఇళ్ల స్థలాలు గా మార్చడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో ప్రజెంట్ తాము పంచుతున్న ఇళ్ల స్థలాల పట్టాలు లబ్ధిదారులు ఐదు సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అన్నట్టుగా ఆశ పెడుతుంది. ఇదిలా ఉండగా ఇళ్ల పట్టాల విషయంలో  జీవో నెంబర్ 44ను హైకోర్టు కొట్టి వేసినప్పుడు… దానిపై స్టే తెచ్చుకున్న తర్వాతనే పంపిణీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అలాందేమీ ప్రభుత్వం తెచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 వ తారీకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకుంటున్నా కానీ అది జరిగే పరిస్థితి కాదని ఇది సరికొత్త ట్విస్ట్ అంటూ కొంత మంది మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

ఇందువల్లే జులై 8 వ తారీకు హఠాత్తుగా పంపిణీ చేసే కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని అంటున్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలు లెక్క చేయకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రోగ్రాం  చేసి ఉంటే ఉన్నత అధికారులు బదిలీ అయ్యే పరిస్థితి ఏర్పడేది అని చెప్పుకొచ్చారు. ఆగస్టు 15వ తారీకు కి కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే చాన్స్ లేదని.. ఇళ్ల పట్టాల విషయంలో చాలా లీగల్ సమస్యలు ఉన్నాయని చాలామంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: