డ్రాగన్ దేశం ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. డ్రాగన్ ఎప్పుడూ చిత్రవిచిత్రమైన ఎత్తుగడలను వేస్తూ ఉంటుంది. చైనా మొదట ఇతర దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా... ఆ దేశానికి తీర్చడం అసాధ్యమైనా చైనా పెట్టుబడులు మాత్రం పెడుతూనే ఉంటుంది. అనంతరం అప్పులు తీర్చలేని దేశాల భూములను కబ్జా చేస్తూ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తుంది. 
 
శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో చైనా ప్రస్తుతం ఇదే విధంగా పాగా వేసింది. చిన్న దేశాల విషయంలో ఆ దేశాలను బెదిరిస్తూ చైనా కబ్జాలకు పాల్పడుతోంది. వ్యాపార, వాణిజ్య సంబంధాల ద్వారా మరికొన్ని దేశాలు తనపై ఆధారపడేలా చైనా చేస్తోంది. చైనా దేశ విసృతి కోసం విచిత్రమైన కుట్ర కోణానికి డ్రాగన్ తెరలేపుతోంది. అయితే ప్రస్తుతం చైనా వివిధ కారణాల వల్ల గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. 
 
చైనా ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ప్రాంతాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. పాక్ లో కూడా వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. అనేకదేశాల్లో చైనా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో పెట్టగా పీవోకే నుంచి ఏర్పాటు చేస్తున్న రోడ్డు మార్గాలే చైనా పెట్టుబడులకు పెట్టడానికి అసలు కారణం. ఆ రోడ్డు నిర్మాణాలు ఇప్పట్లో పూర్తి కాలేదు. మరోవైపు చైనా నుంచి విజృంభించిన కరోనా వైరస్ ఆ దేశానికే శాపంగా మారింది. 
 
చైనాలోని ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకపోవడానికి గల కారణాలు తెలియట్లేదు. అయితే వైరస్ వ్యాప్తి వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో పలు దేశాలు అప్పు చెల్లించే స్థితిలో లేవు. మరోవైపు ఉపాధి అవకాశాలు తగ్గుతూ ఉండటం, పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతూ ఉండటంతో అక్కడి ప్రజలు సైతం ఆందోళన పడుతున్నారు. చైనా ఈ విచిత్ర పరిస్థితిని ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సి ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: