తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో టిడిపి పార్టీ లోకి అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి సీనియర్ లను  సైతం వెనక్కి నెట్టి చంద్రబాబు దృష్టిలో కి వచ్చారు. ఇక ఆ తర్వాత టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి జోరు  ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఢీ కొట్టే అసలు సిసలైన నాయకుడు రేవంత్ రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. మాటల్లో అయినా బలం లో అయినా కెసిఆర్ కి ధీటుగా ఉంటారు రేవంత్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సీనియర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు  చూపుతుండటం అందరికీ తెలిసిందే. 


తన వ్యూహాలను  అమలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం లో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇలా ఎన్నో సార్లు వ్యూహాలను అమలు చేశారు, ఒక పాయింట్ ని ఎలా లేవనెత్తి ఎవరెవరికి  ఫిట్టింగ్ పెట్టి ఎలా వివాదం రాగల్చాలి  అన్నది కరెక్ట్ గా చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని రాష్ట్ర గవర్నర్ తమిళ సై పిలిస్తే ఎందుకు రాలేదు... ఆరోగ్య ముఖ్య కార్యదర్శి శాంతకుమారి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ లను  వెంటనే విధుల నుంచి తొలగించాలని అంటూ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. 

 

 తద్వారా ప్రస్తుతం బిజెపి పార్టీ నుంచి ఉన్న గవర్నర్ తమిళ సై కి.. కెసిఆర్ కి మధ్య విభేదాలు వచ్చేలా చేయడం అనే ఒక ప్రణాళికను అమలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే గవర్నర్ కల్పించుకోవాలి లేకపోతే కేంద్రం కల్పించుకోవాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ తమిళిసై ఉన్నప్పటికీ ఎందుకు కల్పించుకోవడం లేదు అని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్, అంతే కాకుండా హైదరాబాద్ లో ప్రతి భవనం గవర్నర్ అధీనంలో  ఉంటుందని సచివాలయం కూల్చివేత కు గవర్నర్ అనుమతి తెలంగాణ ప్రభుత్వం తీసుకుందా అని ఒక పాయింట్ తెరమీదకి తెచ్చి.. రేవంత్  గవర్నర్ కి  కూల్చివేతను ఆపాలని చెప్పకనే చెప్పారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: