నెల ముందు వరకు కరోనాను కట్టడి చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రం కేరళలో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లాక్ డౌన్ ను పక్కగా అమలు చేసి కరోనా వ్యాప్తిని అరికట్టిన కేరళకు..విదేశాల నుండి అలాగే పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వారి వల్ల ఇబ్బందులు మొదలయ్యాయి. వారి వల్ల కాంటాక్ట్ కేసులు కూడా పెరగడంతో గత కొన్నిరోజులుగా కేరళలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈరోజు ఏకంగా రికార్డు స్థాయిలో 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఇందులో 90 కేసులు కాంటాక్టు ద్వారా వచ్చినవే.. అయితే మరణాల విషయంలో మాత్రం కేరళ మిగితా రాష్ట్రాల కంటే బెటర్ పొజిషన్ లో వుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 6195కేసులు నమోదుకాగా కేవలం 27మరణాలు మాత్రమే సంభవించాయి.  


ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది. తమిళనాడు ఈరోజు 3756 కేసులు నమోదుకాగా 64మంది కరోనాతో మృతి చెందారు దాంతో ఇప్పటివరకు ఆరాష్ట్రంలో మొత్తం 122350కేసులు నమోదు కాగా 1700 కరోనా మరణాలు సంభవించాయి అలాగే కర్ణాటకలో ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2062కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 28877కి  చేరింది. కాగా ఈఒక్క రోజే 54 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 470కి చేరింది.   తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఈరోజు అత్యధికంగా1924 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 29836కు చేరింది. ఈరోజు మరో 11మంది మరిణించడంతో రాష్ట్రంలో కరోనా తో మరణించిన వారి సంఖ్య 324కు చేరింది ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 1062కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 22259చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 264 కరోనా మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: